Thursday, 30 July 2026 04:17:16 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప

Date : 21 July 2026 07:48 PM Views : 55

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూలై 21 : ఈనెల 24వ తేదీ శుక్రవారం,మదనపల్లి నందు గల జిల్లా ఎస్టీయు కార్యాలయంలో జరిగే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అన్నమయ్య జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిటి.కృష్ణప్ప పిలుపునిచ్చారు. మగళవారం 21 వ తేదీన స్థానిక చిన్న తిప్ప సముద్రం చెంచులక్ష్మి యానాధికాలని నందు మదనపల్లి నియోజకవర్గ సమావేశం కే సిద్దయ్య అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తోపు కృష్ణప్ప ఈ‌ సందర్భంగా పాల్గొన్న ,మాట్లాడుతూ; ఎన్నికలకు ముందు వ్యవసాయ కూలీలకు అనేక హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం సదురు హామీలను తుంగలో తొక్కి కష్టజీవులను పూర్తిగా మోసం చేసిందన్నారు. మదనపల్లి నియోజకవర్గంలో గిరిజనులు దళితులు దుర్భర జీవితాలు అనుభవిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెట్లు ఇంటి స్థలం ఇస్తూ ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటిదాకా ఒక ఇల్లు కూడా ఇచ్చిన దాఖలాలు లేదని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలైనా పేదలకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని వారు తీయబడ్డారు గిరి పుత్రులకు అటవీ బంజర భూములు ఫారెస్ట్ భూములు వన సంరక్షణ సమితి ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు రాష్ట్రంలో లక్షలాది ఎకరాల భూమిని కార్పొరేట్లకు,ధనవంతులకు,రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కారు చౌకగా కట్టపెట్టేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నాయని, భూమిలేని నిరుపేద వ్యవసాయ కూలీలకు సాగు భూమిని పంపిణీ చేసేందుకు శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు. 2013 సంవత్సరం నుండి పేదలకు భూ పంపిణీ పూర్తిగా ఆగిపోయిందని, గతంలో కోనేరు రంగారావు భూ కమిటీ సిఫారసులు మేరకు భూమిలేని ప్రతి కుటుంబానికి రెండు ఎకరాల సాగు భూమి, ఐదు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వవచ్చని,అందుకు సరిపడా ప్రభుత్వ భూములు ఉన్నాయని తెలిపినా కూడా ఆ సిఫార్సులను ప్రభుత్వాలు చెత్తబుట్టలో పడేసాయని విమర్శించారు.ఈ నేపథ్యంలో పేదలను సమాయత్తం చేసి మరో భూ పోరాటాలకు శ్రీకారం చుట్టాలనే లక్ష్యంతో ఈ యొక్క సమావేశం జరుగుతున్నదని,ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బికేఎంయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ కోటేశ్వరరావు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు లు హాజరవుతున్నారని, భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించే సమావేశానికి అధిక సంఖ్యలో కష్టజీవులందరూ పాల్గొని జయప్రదం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. అనంతరం సమావేశం లో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులుL మునిరత్నం కె సిద్దాయ్య మునికట్టయ్య గోపాల్ ప్రసాద్ వెంకటేష్ ఉమా నీవవతి నిర్మలమ్మ భూదేవి భూదేవి రాజామ్మ రాణి పాపులమ్మ తదితరులు పాల్గొన్నారు

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :