నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : జిల్లా బి కొత్తకోట అప్పుల బాధ తాళ లేక ఉరి వేసుకొని రైతు ఆత్మహత్య అప్పుల బాధ తాళ లేక ఉరి వేసుకొని రైతు ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన బి.కొత్తకోటలో మంగళవారం సాయంత్రం వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని బడి కాయల పల్లె పంచాయతీ, జింకలదాట్ల పల్లి కు చెందిన గాలివీటి నరసింహులు నాయుని కుమారుడు రైతు జి. రెడ్డప్ప నాయుడు(45) వ్యవసాయంతో జీవనం సాగిస్తూ భార్య పిల్లల్ని పోషించు కుంటున్నాడు. ఇటీవల సాగు చేసిన టమోటా పంటలకు గిట్టుబాటు రేట్లు లేకపోవడం, పాడియావులు కొనుక్కుని అవి పాలు సక్రమంగా ఇవ్వక పోవడం, గతం కుటుంబ అవసరాలకు చేసిన అప్పులు మొత్తం సుమారు 7 లక్షలకు పైగా పేరుకుపోవడంతో అప్పులు తీర్చలేకపోయాడు. దానికి తోడు రుణదాతల ఒత్తిళ్ల కారణంగా జీవితం పై విరక్తి చెంది. ఊరికి సమీపంలోని తోటలో చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో వారు మృతదేహాన్ని పరిశీలించి పంచనామ అనంతరం, పోస్టు మార్టం కోసం మదనపల్లె ప్రభుత్వాసుపత్రి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జీవన్ గంగానాథ్ బాబు తెలిపారు.
Reporter
Namitha News