Thursday, 16 April 2026 07:55:43 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

అక్షరధాత్రి సెంటర్లు విజ్ఞానాన్ని పంచే చక్కని వేదికలు

విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తున్న స్వాతి

Date : 04 September 2025 06:38 PM Views : 169

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అక్షరధాత్రి సెంటర్లు విజ్ఞానాన్ని పంచే చక్కని వేదికలు - నిరుపేద విద్యార్థులకు ఉచిత ట్యూషన్లు - విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తున్న స్వాతి చక్రపాణి మదనపల్లె : అన్నమయ్య జిల్లా,మదనపల్లె పట్టణం నందు నిస్వార్ధ సేవా కార్యక్రమాలే లక్ష్యంగా ఫిబ్రవరి 15, 2019న ధాత్రి స్వచ్ఛంద సంస్థను డాక్టర్ స్వాతి చక్రపాణి ఏర్పాటు చేశారు.అప్పటి నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు.అందులో ప్రధానమైంది అక్షరధాత్రి సెంటర్లు.పట్టణంలోని నిరుపేద మరియు పేద కుటుంబాల్లోని పిల్లలను ఉచితంగా సాయంత్రం బడులను నిర్వహిస్తూ వారికి ఆట - పాటల ద్వారా సులువుగా అర్థమయ్యేలా బోధిస్తూ మరియు సులువైన విధానాల ద్వారా పిల్లలకు జ్ఞాపకశక్తిచే దిశలో పాఠ్యాంశాలను బోధిస్తూ విలువలతో కూడిన విద్యను అందించడమే ఈ అక్షరధాత్రి ముఖ్య ఉద్దేశ్యం.ఇందులో ఎంతో మంది పేదవాళ్లు ఖర్చుపెట్టి టూషన్లకి,ట్యుటోరియల్స్ కి వెళ్లలేని విద్యార్థిని,విద్యార్థులు సులువుగా ఉచితంగా ఇక్కడ చదువుకోవచ్చునన్నారు.ఆ చదువు కూడా పిల్లలకు అర్థమయ్యే సరళ భాషలో నేర్పిస్తూ స్పోకెన్ ఇంగ్లీష్,మ్యాథమెటిక్స్ పైన పట్టుసాధించే విధంగా ప్రాక్టికల్ పద్ధతుల ద్వారా పిల్లలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తూ ప్రతిరోజు సాయంత్రం రెండు గంటలపాటు విద్యని అందిస్తూ మరియు స్కూల్ నుంచి ఇచ్చినటువంటి హోంవర్క్ ని పిల్లలకు కంప్లీట్ చేసి ఇంటికి పంపిస్తారు.దీని ద్వారా పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగడంతోపాటు ఇచ్చిన హోంవర్క్ పెండింగ్ పడకుండా కంప్లీట్ చేస్తున్నారు.పాఠశాలలలో అర్థం కానివి తిరిగి ఆప్యాయంగా పలకరించే టీచర్స్ ద్వారా నేర్చుకుంటూ,ఆంగ్ల పరిభాష మీద పట్టుని సాధిస్తున్నారు.మోడల్స్ సంతను ఏర్పాటు చేసి కేజీలు,తూనికలు,లీటర్స్ ఎలా కొలవాలనే అంశాలను ప్రయోగాత్మకంగా పిల్లల చేత ఈ సంతలను ఏర్పాటు చేయటం అక్షరధాత్రి నైట్ స్కూల్స్ యొక్క ప్రత్యేకత అంటున్నారు ధాత్రి ఫౌండేషన్ నిర్వాహకురాలు డాక్టర్ స్వాతి చక్రపాణి.పిల్లలకి ప్రతి శనివారం ఆటవిడుపు కార్యక్రమాలని ఏర్పాటు చేయడం వలన పిల్లలకి ఆహ్లాదంగా ఉంటుందని,చదువుని ఒత్తిడిగా తీసుకునే పిల్లలు సైతం అక్షరధాత్రి విద్యా బోధనల ద్వారా చాలా సులువుగా నేర్చుకొని సంతోషంగా పాఠశాలలకు వెళ్తున్నారని పిల్లల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.దినసరి కూలీలు,చేనేత రంగంపై ఆధారపడిన కుటుంబీకుల పిల్లలు కూలి పనులకు వెళ్లి తాము తిరిగి వచ్చేంతవరకు సురక్షితంగా ఈ అక్షరధాత్రి సాయంకాలపు బడులను పిల్లలు సురక్షితంగా ఉంటున్నారని,ఈ అక్షరధాత్రి నిర్వహిస్తున్న ధాత్రి ఫౌండేషన్ నిర్వహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.చదువుతోపాటు సంరక్షణ,మరియు సాయంకాలం పిల్లలకి పోషకాహారం సైతం అందజేస్తున్నారు.కావున పిల్లలు మరింత సంతోషంగా ఈ సాయంకాలపు బడులకి వస్తూ ఎన్నో కొత్త విషయాలను నేర్చుకుంటూ,పెద్దవారిని గౌరవిస్తూ,దేశభక్తిని పెంపొందించుకుంటూ రాబోయే తరానికి మంచి భావి భారత పౌరులుగా మార్చాలని గొప్ప సంకల్పంతో ఈ అక్షరధాత్రి సాయంత్రం బడులు కొనసాగుతున్నాయి.పిల్లలకి బుక్స్,పెన్స్,పెన్సిల్స్,ఎగ్జామ్ పాడ్స్,జామెంట్రీ బాక్స్,మొదలగు విద్యాసామాగ్రిణి మరియు స్వెటర్స్,షూస్,ధాత్రి ఫౌండేషన్ ద్వారా అప్పుడప్పుడు పిల్లలకి అందిస్తున్నామని,దాతలు సహకారం అందిస్తే ఈ సేవలను మరింత విస్తృతం చేయాలని ఉందని ధాత్రి ఫౌండేషన్ సభ్యులు తెలియచేశారు.ఈ సందర్భంగా స్వాతి చక్రపాణి మాట్లాడుతూ ధాత్రి పౌండేషన్ ద్వారా మహిళలకు కుట్టు మిషన్లు,అల్లికలపై శిక్షణనిస్తూ వారి ఆర్థిక స్వాలంబనికు బాటలు వేస్తున్నామన్నారు.అదేవిధంగా కరోనా సమయంలో వందలాది కుటుంబాలకు నిత్యావసరాలు అందజేసి బాసటగా నిలిచామన్నారు.ఇటీవల కాలంలో ఆనంద నిలయం పేరిట వృద్దాశ్రమాన్ని ఏర్పాటు అలసిన వృద్ధ జీవితాల్లో ఆనందాన్ని నింపుతున్నామన్నారు.దాతల సహకారంతో ధాత్రి పౌండేషన్ సేవలను ముందుకు తీసుకెళ్తామని వారు స్పష్టం చేశారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :