నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె నవంబర్ 11 : తంబల్లపల్లె మండలం లో సోమవారం మల్లయ్య కొండ శివాలయం తో పాటు మండలంలోని శివాలయాలలో కేదారేశ్వర స్వామి వ్రత నోములు కార్యక్రమం వైభవంగా జరిగింది. ఉదయం మల్లయ్య కొండలో వందలాదిమంది మహిళలు మహాశివునితో పాటు గౌరీ మాత ఆలయంలో కేదారేశ్వర స్వామి నోములు నోచుకున్నారు. అదేవిధంగా తంబళ్లపల్లె సోమేశ్వరాలయం లో సైతం మహిళలు పెద్ద ఎత్తున కేదారేశ్వర స్వామి వ్రత నోములు నోచుకున్నారు. మహిళలు హలో శివాలయాలలో గణపతి, కుమారస్వామి, గౌరీ మాత తో పాటు ప్రమద గణాలకు ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, ధూప దీప నైవేద్యాలు సమర్పించి గౌరీ మాత ఆశీర్వాదాలు పొందారు. మల్లయ్య కొండలో ఈవో ముని రాజా, రికార్డ్ అసిస్టెంట్ కొండకిట్ట లో ఆధ్వర్యంలో భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో నిమగ్నమయ్యారు. కేదారేశ్వర స్వామి వ్రత నోము సందర్భంగా మండలంలోని ఆలయాలు కిటకిటలాడాయి.
Reporter
Namitha News