నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా మదనపల్లె *ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తే ఊరుకోం డిఎస్పీ* వ్యాపారులు, హోటళ్ల నిర్వాహకులు, ట్రాఫిక్ కు అంతరాయం కలిగించేలా వ్యవహరిస్తే ఊరుకోమని డిఎస్పి మహేంద్ర తెలిపారు. శనివారం పట్టణంలోని బెంగుళూరు బస్టాండ్, సిటిఎం రోడ్డులొ ట్రాఫిక్ పోలీసులతో కలిసి డిఎస్పీ ట్రాఫిక్ సమస్యపై పరిసీలించారు. దుకాణాలు, హోటళ్లు, తోపుడు బండ్ల వద్ద నిలిపిన వాహనాలను గుర్తించి, ట్రాఫిక్ కు అంతరాయం కలిగేలా వాహనాలు నిలిపితే సంబంధిత వ్యాపారస్తులపై చర్యలు తప్పవని డిఎస్పీ హెచ్చరించారు.
Reporter
Namitha News