నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కరెంట్ షాక్ తో పాడి అవులు మృతి. గతంలో కూడా ఇదే జెసిబి రిపైర్ షాపు వద్ద ఇరవై గొర్రెలు మృతి చెందిన ఘటన. మదనపల్లి పట్టణంలో గత రెండు రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాలతో మదనపల్లి పట్టణం స్థానిక పుంగనూరు రోడ్డు శ్రీకృష్ణదేవరాయల సర్కిల్ సమీపంలోని జెసిబీ రిపేరు షాప్ వద్ద రైతు రమణయ్య కు చెందిన పాడియా ఆవులు రెండు కరెంటు షాక్ తో మృత్యువాత పడ్డాయి. అకాల వర్షాలకారణంగా కరెంటు సరఫరా రావడంతో ఈ ఘటన జరిగినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. రెండు లక్షల రూపాయలు విలువచేసే పాడే ఆవులు మృతి చెందడంతో రైతు రమణయ్య కన్నీటి పర్యంతమయ్యాడు. ఘటనపై ప్రభుత్వం ఆదుకొని తనకు ఆర్థిక సహాయం చేయాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశాడు.
Reporter
Namitha News