నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె సెప్టెంబర్ 27 : తంబళ్లపల్లె మండలం పరసతోపు పంచాయతీ లోని రైతులు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సబ్సిడీ ఉలవలను సద్వినియోగం చేసుకోవాలని టిడిపి బీసీ సంఘ నాయకుడు స్వామి రెడ్డి కోరారు. శుక్రవారం పరస తోపు సచివాలయంలో అంబేద్కర్ పంచాయతీలోని రైతులకు 10 కిలోలు ఉలవలు 80 శాతం సబ్సిడీతో పంపిణీ చేసి బీడు భూముల్లో పంట వేయాలని సూచించారు. అదేవిధంగా రైతులు ఈక్రాప్, ఈ కేవైసీ చేయించుకుని ప్రభుత్వం నుండి వచ్చే సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, ఇతర రైతులు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు రాజారెడ్డి, సచివాలయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
Admin
Namitha News