నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థలో పూర్వ విద్యార్థి అన్నదాన వితరణ....... చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థలో పూర్వ విద్యార్ధి అయినా V. వంశీ రెడ్డి తన పుట్టినరోజు సందర్బంగా పిల్లలకు మరియు వృద్ధులకు పోషక విలువలతో కూడిన మాంసాహార అన్నదాన వితరణ చేశారు...... ఈ సందర్భంగా చైతన్యసొచ్చింది సేవా సంస్థ జనరల్ సెక్రెటరీ ఏ కవితా రాణి గారు మాట్లాడుతూ శ్రీమతి మరియు శ్రీ రమాదేవి మద్ది రెడ్డి గారి కుమారుడు కుటుంబ పరిస్థితుల వలన పేదరికం వల్ల చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థలో ఎనిమిదవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకొని తర్వాత ఐటిఐ విద్యను అభ్యసించి ఎలక్ట్రిషన్ గా ఉత్తీర్ణత సాధించారు. ప్రస్తుతం ఎలక్ట్రిషన్ గా విధులు నిర్వహిస్తూ తన తల్లిదండ్రుని పోషిస్తున్నాడు.. మన చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా విద్యను అభ్యసించి నేడు తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని ఈనాడు తన పుట్టినరోజు కారణంగా పిల్లలకు మరియు వృద్ధులకు అన్నదాన వితరణ చేయడం చాలా గర్వకారణంగా ఉంది.. వంశి రెడ్డి గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఎంపీ ఆనందం గారు అడ్మిన్ డైరెక్టర్ డాక్టర్ జి వి ఎస్ బాబు గారు, ముత్తు ఆంగ్ల మాధ్యమ పాఠశాల ప్రధానోపాధ్యారాలు పట్నం గిరిజంమాల్ గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏ కృష్ణ చరణ్ ముత్తు ఆంగ్ల మాధ్యమ పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఆనంద వృద్ధాశ్రమ వృద్ధులు పాల్గొన్నారు
Reporter
Namitha News