Thursday, 16 April 2026 04:31:48 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

ప్రయోగశాల లను సమర్థవంతంగా నిర్వహించాలి - జిల్లా సైన్స్ అధికారి ఓబుల్ రెడ్డి

స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో టీచర్లకు పలు సూచనలు

Date : 17 August 2024 11:08 PM Views : 161

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి-ఆగస్టు17 : అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల లోని ప్రయోగశాలలను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా సైన్స్ అధికారి మార్ల ఓబుల్ రెడ్డి సైన్సు ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం రాయచోటి నేతాజీ సర్కిల్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను ఆయన సందర్శించారు. విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించడం సైన్సు ఉపాధ్యాయుడి బాధ్యత అని అన్నారు. అందుకు ప్రయోగశాల సరైన వేదిక అని అన్నారు. విద్యార్థులతో ప్రయోగాలు చేయించడం ద్వారా పాఠ్యాంశాలలోని శాస్త్రీయ భావనలను సులభంగా అర్థం చేయించవచ్చునని ఆయన అన్నారు. జిల్లా వ్యాప్తంగా 27 అటల్ టింకరింగ్ ల్యాబ్ లు,17 స్టెమ్ ల్యాబ్ లు,20 పాల్ ల్యాబ్ లు, 5 ఆస్ట్రానమీ ల్యాబ్ లు, 250 సైన్స్ ల్యాబ్ లు ఉన్నాయని అన్నారు. సైన్స్ ఉపాధ్యాయులంతా ఈ ల్యాబ్ లను సక్రమంగా నిర్వహించి,ప్రయోగాలు, పరిశీలనలు, విధానాలు మరియు ఫలితాలను రికార్డులలో నమోదు చేయాలన్నారు. ప్రమాదాలు మరియు రసాయన ప్రతిచర్యలను నివారించడానికి భద్రతా మార్గదర్శకాలను పాటించాలన్నారు.ల్యాబ్‌లో భద్రతా జాగ్రత్త చర్యలను చూపించే చార్ట్‌ను వేలాడదీయాలన్నారు. నిర్వహించడానికి సాధ్యం కానీ ప్రయోగాలను ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ లను ఉపయోగించి సిమిలేషన్ ప్రయోగాల ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. స్థానిక వనరులను ఉపయోగించడం, క్షేత్ర పర్యటనల ద్వారా విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవాలను కల్పించి శాస్త్ర భావనలను అవగాహన కల్పించాలన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :