నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పెద్దాయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో సమావేశం అయిన నిస్సార్ అహమ్మద్.... పెద్దాయన, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో మదనపల్లె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ సమావేశం అయ్యారు. మంగళవారం తిరుపతి లోని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వగృహంలో నిస్సార్ అహమ్మద్ సమావేశమైనారు. ఈ సందర్భంగా రాజంపేట పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో పలు అంశలపై చర్చించారు. నిస్సార్ అహమ్మద్ తోపాటుమాజీ. APSRTC రాష్ట్ర చైర్మన్ కమలాపురం మల్లికార్జున రెడ్డి, కల్యాణదుర్గం ఇన్‌చార్జ్ ఉమామహేశ్వర్ నాయుడు, హిందూపూర్ ఇన్‌ఛార్జ్ వేణుగోపాల్ రెడ్డి, ఈశ్వర్ నాయక్ మల్లికార్జున రెడ్డి, ఖిజార్ ఖాన్, మహేష్ పాల్గొన్నారు.
Reporter
Namitha News