Thursday, 16 April 2026 04:26:20 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

రైతులకు యూరియా డిఏపి అందించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి

Date : 08 September 2025 03:25 PM Views : 166

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రైతులకు యూరియా డిఏపి అందించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. వ్యవసాయ ఎరువుల బ్లాక్ మార్కెట్ ను అరికట్టాలి ప్రభుత్వ కార్యాలయం చుట్టూ రైతులు తిరుగుతున్న రైతులకు అందని యూరియా రైతులు యూరియా కొరత తీర్చమంటే నిర్బంధం చేస్తారా? రైతుల పంటలకు ఎరువుల సమృద్ధిగా అందించాలి. సిపిఐ సిపిఐ నాయకులు డిమాండ్ దేశవ్యాప్తంగా నెలకొన్న రైతుల పంటలకు అవసరమయ్యే ఎరువులు కొరతను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కృష్ణప్ప,కార్యవర్గ సభ్యులు సాంబశివ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రైతు పంట పొలాలకు అవసరమయ్యే ఎరువులు కొరత పెరిగిందని, రైతులు అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని, ఎరువులు కొరతను ఆసరాగా చేసుకుని ప్రైవేట్ షాపులు బ్లాక్ మార్కెట్లో అధిక రేట్లు పెంచి వ్యాపారస్తులు సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు. ఎరువుల కోసం రైతులు రోజు అగ్రికల్చర్ ఆఫీసులు, సచివాలయాలు,అర్బికె సెంటర్స్ల చుట్టూ తిరుగుతున్నారని, ఆర్బికే సెంటర్లు, అగ్రికల్చర్ ఆఫీసుల్లో రైతులకు స్లాట్ పద్ధతుల్లో ఇరువుని ఇస్తామని స్లిప్పులు అందజేస్తున్నారని ఆ స్లిప్పులు పట్టుకుని రోజు రైతులు తిరుగుతున్న ఏ ఒక్క రైతు కూడా అందలేదని, ఆరోపణ చేశారు. రైతుకు యూరియా అనేది నిత్యం అవసరమని, ఆర్టికల్చర్ అయిన,అగ్రికల్చర్ అయినా అన్ని పంటలకు యూరియా అవసరమని,అలాంటి యూరియా కొరత భారీగా ఉందని గత కొద్దిరోజులుగా రైతులు వ్యవసాయం వదిలి ఆఫీసు చుట్టూ తిరుగుతున్న,ఒక్క మూట ఎరువు కూడా రైతుకు దొరకలేదన్నారు. రైతుల పంట పొలాలకు అవసరమయ్యే ఎరువులను అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైపల్యం చెందారాన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రభుత్వం ఆర్బికే సెంటర్ ద్వారా ఎరువులు అందజేయాలని బ్లాక్ మార్కెట్లను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి కే మురళి,మదనపల్లి మండల కార్యదర్శి రెడ్డి శేఖర్,పట్టణ కార్యదర్శి మాధవ్,దేవా,తిరుమల, రైతు సంఘం నాయకులు మోహన్ ఎండపల్లి వెంకటరమణ, టిహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు హరికుమార్ తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :