నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఏప్రిల్ 27: అంగళ్ళు సమీపం లో గల మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, మదనపల్లె కళాశాల నందు విద్యార్థులకు మరియు అధ్యాపకులకు నేషనల్ ప్రోగ్రాం ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్(NPTEL) మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాసు వారు స్వయం అను పేరుతో నిర్వహించిన సర్టిఫికెట్ కోర్స్ ఆన్లైన్ పరిక్షను కళాశాలలో నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. సి. యువరాజ్ తెలిపారు. ఈ పరీక్ష లో శుక్రవారం నుంచి ఆదివారం వరకు కళాశాల ప్రాంగణం లో నిర్వహించారని, ఈ ఆన్లైన్ పరీక్షకు 3,928 మంది నమోదు చేసుకోగా 3793 మంది మూడురోజుల పాటు హాజరు అయినట్లు, 135 మంది గైర్హాజరు అయినట్లు ఆయన అన్నారు. వివిధ సబ్జెక్ట్స్ లో ఆన్లైన్ పరీక్షల ను యెన్.పీ.టి.ఈ.ఎల్ (NPTEL) వారు సంవత్సరానికి రెండు సార్లు నిర్వహిస్తారని ఆయన అన్నారు. ఈ పరీక్ష ల లో ఉతీర్ణులు అయిన విద్యార్థులకు మరియు అధ్యాపకులకు ఆన్లైన్ సర్టిఫికెట్ ను యెన్.పీ.టి.ఈ.ఎల్ (NPTEL) వారు అందజేస్తారని, ప్రతి ఏటా తమ విద్యార్థులు మరియు అధ్యాపకులు ఈ పరీక్షలు రాస్తారని ఆయన అన్నారు.
Admin
Namitha News