Thursday, 16 April 2026 06:11:41 PM
# వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ధర్నా

Date : 20 May 2025 03:46 PM Views : 122

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ధర్నా - జులై 8వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి - ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.శ్రీనివాసులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యులకు, పేదలకు వ్యతిరేకంగా కొత్త కొత్త చట్టాలు తీసుకొస్తూ కార్పొరేట్లకు అనుకూలంగా పరిపాలన చేస్తున్నాయని ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రజలు అందరూ ఐక్యంగా ఉద్యమించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.శ్రీనివాసులు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు కేంద్ర కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల పిలుపు మేరకు ధర్నా నిర్వహించారు. లేబర్ కోడ్ లు రద్దు చెయ్యాలని, కనీస వేతనం 26వేలు ఇవ్వాలి, రైతు పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలి, టమోటా మార్కెట్ లో జాక్ పాట్ రద్దు చెయ్యాలి, ఉపాధి పని 200రోజులకు పెంచాలి, 600 రూపాయలు వేతనం ఇవ్వాలి అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. అనంతరం శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కరోనా సమయంలో చర్చ లేకుండా తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను అమలు కై చేస్తున్న తీవ్ర ప్రయత్నాలను అడ్డుకునేందుకు భారత దేశంలోని యావత్ కార్మికవర్గం మే 20వ తేదిన సమ్మెకు పిలుపునిచ్చారని గుర్తు చేశారు. దేశంలో వచ్చిన మతోన్మాద, ఉగ్రవాద చర్యలు నేపథ్యంలో సమ్మె వాయిదా వేశారని, కేంద్ర ప్రభుత్వ దుర్మారమైన ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ధర్నా చేస్తున్నట్లు వివరించారు. కార్మిక చట్టాలు బలంగా ఉన్నప్పుడు కూడా కార్మికులకు అరకొరగా మాత్రమే అమలు జరిగేవని, ఇప్పుడు 44 కార్మిక చట్టాలను రద్దు చేసిన తర్వాత భారతీయ కార్మికులు బానిసల కంటే దారుణమైన పరిస్థితుల్లోకి నెట్టబడతారని హెచ్చరించారు. హైర్ అండ్ ఫైర్, ఫిక్సిడ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్, ఆప్రెంటీస్ విధానాల ద్వారా కార్మికుల శ్రమను కార్పొరేట్ యాజమాన్యాలకు దోచి పెట్టేందుకే మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ లు తీసుకువచ్చిందని గుర్తు చేశారు. చట్టాన్ని ఉల్లంఘించే యాజమాన్యాలపై విధించే శిక్షలను తొలగించి, రాజ్యాంగబద్ధంగా పోరాడే కార్మికులపై క్రిమినల్ చర్యలు తీసుకునేలా చట్టాలను మార్పులు చేయడాన్నీ కార్పొరేట్ పెట్టుబడిదారుల లాభల కోసమేనని విమర్శించారు. పెట్టుబడిదారి ఆర్థిక సంక్షోభాన్ని సామాన్య ప్రజలపై, కార్మికులపై బలవంతంగా రుద్దేందుకు మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కార్మికులు సంఘాలతో నిమిత్తం లేకుండా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. లేబర్ కోడ్ రద్దు చేయడం, ఇండియన్ లేబర్ ప్రైవేటీకరణను నిలిపివేయడం, ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ ద్వారా క్రమం తప్పకుండా సంప్రదింపులు జరపడం, నెలవారీ కనీస వేతనం రూ. 26,000, ఉద్యోగుల పెన్షన్ పథకం కింద నెలవారీ పెన్షన్ రూ. 9,000 అందించడం సహా పలు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే విరాళాలతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి, దాని ద్వారా ఏ పథకం కిందకు రానివారికి నెలకు రూ. 6,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా కార్మికుల వ్యతిరేకతను అర్థం చేసుకుని చట్టాలను వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో జులై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె కి సిద్ధమవుతున్నట్లు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి డీ.ప్రభాకర్ రెడ్డి, నాయకులు కృష్ణమూర్తి, నాగరత్న, కృష్ణ, సవిత, రామకృష్ణ, రాజు, కృష్ణప్ప, శంకర్ నాయక్, గౌరీ, ప్రమీల, సుగుణ, ప్రభావతి, విజయ తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :