నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : టమోటా రైతులకు పాదయాత్రలో లొకేష్ ఇచ్చిన హామీ ఏమైంది...?? గిట్టుబాటు ధర లేక టమోటా రైతాంగం పడుతున్న ఇక్కట్లు పట్టని కూటమి ప్రభుత్వం... మదనపల్లె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ విమర్శలు... చంద్రబాబునాయుడు 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసగించి గద్దెనెక్కిన జూన్ 4 వెన్నుపోటు దినోత్సవం -- నిస్సార్ అహమ్మద్ ఆద్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ చంద్రబాబునాయుడు గద్దెనెక్కిన జూన్ 4 వెన్నుపోటు దినోత్సవంగా రాష్ట్రం అంతా జరుపుకోవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించడం జరిగిందని మదనపల్లె సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ వెల్లడించారు. ఇచ్చిన హామీలు విస్మరించి, మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన జూన్ 4 వెన్నుపోటు దినోత్సవంగా జరుపుకోవాలని మదనపల్లె వైసిపి కార్యాలయంలో వెన్నుపోటు దినోత్సవం పోస్టర్ ఆవిష్కరణ మదనపల్లె సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ ఆద్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వైసిపి నాయకులు, కార్యకర్తలు హాజరైనారు. ఈ సందర్భంగా నిస్సార్ అహమ్మద్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఏడాది కాలంలో ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను వెన్నుపోటు పొడిచిందని విమర్శలు గుప్పించారు. ఉద్యోగస్తులకు టిఎ, డిఎ, పిఆర్‌సి ఇవ్వలేదన్నారు. రైతుల పరిస్థితి మరి దయనీయంగా ఉందన్నారు. ముఖ్యంగా మదనపల్లె ప్రాంతంలో టమోటా రైతుల దుస్థితి దారుణంగా ఉందని, ధరలు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పాదయాత్ర సందర్భంగా లోకేష్ ఇచ్చిన హామి ఏమైంది, టమోటా రైతుల కోసం టమోటా ప్రాసెసింగ్ యూనిట్, కోల్డ్ స్టోరేజ్ ఏమైందన్నారు. గిట్టుబాటు ధరలు లేకపోగా ఫర్టిలైజర్ దొరకలేదన్నారు. నిరుద్యోగులకు ఉపాధి లేకపోవడం, ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ బృతి ఇవ్వలేదని విమర్శలు గుప్పించారు. వాలంటీర్లు, యండియూ వాహనాల తొలగించి నిరుద్యోగులు పెంచారని అన్నారు. మహిళలకు ఎలాంటి పధకాలు అందడం లేదన్నారు. రాజంపేట పార్లమెంటు సభ్యులు పివి. మిథున్ రెడ్డి మదనపల్లెకు మంజూరు చేయించిన సెంట్రల్ యూనివర్శిటీ ఏమైందని ప్రశ్నించారు. గత వైసిపి ప్రభుత్వంలో అన్ని వర్గాలకు నెలవారి పట్టిక తయారు చేసి ఆయా నెలలో వారికి ఖచ్చితంగా బటన్ నొక్కి అమలు చేయడం జరిగిందని తద్వారా ప్రజలంతా సంక్షేమ పధకాలు అందుకున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మనూజ, కౌన్సిలర్లు శారదరెడ్డి, యూనస్, మల్లికార్జున, మహేష్, చరణ్, చిన్న తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News