Thursday, 16 April 2026 06:11:38 PM
# వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు

తంబళ్లపల్లి టిడిపిలో బలమైన క్యాడర్ తో తనదైన ముద్ర వేసిన జి.శంకర్ యాదవ్

బలమైన క్యాడర్ కలిగిన బీసీ నేతగా, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, ముఖ్య టిడిపి ప్రముఖులతో సత్ససంబధాలు కలిగిన నాయకుడు

Date : 28 September 2025 01:29 PM Views : 257

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - సెప్టెంబర్ 28: తంబళ్లపల్లి టిడిపిలో జి.శంకర్ యాదవ్ ది బలమైన ముద్రవేశారు.మాజీ ఎమ్మెల్యేగా నియోజకవర్గం అభివృద్ధికి ఆయన విశేష కృషి చేశారు. 2014లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించారు.ఐదేళ్లపాటు అటు ప్రజలకు,ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తల అభ్యున్నతికి ఎనలేని కృషిచేశారు.అంతేకాకుండా బీసీలను ఏకతాటిపై తీసుకురావడంలో ఆయన సఫలీకృతులయ్యారు.ఇదే ఉమ్మడి చిత్తూరు జిల్లాలలో బలమైన బీసీ నేతగా ఆయనను నిలబెట్టింది.అంతేకాకుండా నియోజకవర్గంలోని 6 మండలాల్లోని మారుమూల ప్రాంతాలకు సైతం మౌలిక సదుపాయాలను కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుంది.2019లో వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించి వేళ తంబళ్లపల్లిలో సైతం శంకర్ ఓటమిపాలయ్యారు. 2019 నుండి 2024 వరకు పెద్దిరెడ్డి కుటుంబం దౌర్జన్యాలను,దాడులకు ఎదురొడ్డి నిలబడి కార్యకర్తలను కాపాడుకున్నారు.అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ అధిష్టానం అప్పటి వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిలుపునిచ్చిన బాదుడే-బాదుడు,ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి తదితర కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు.అనంతరం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి ఎస్సీ,ఎస్టీ సర్పంచ్ అభ్యర్థులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేశారు.వైసీపీ ఒత్తిళ్లకు తంబళ్లపల్లి నియోజకవర్గంలో 13 మంది సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకొని శభాష్ అనిపించుకున్నారు.టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యువగళం పాదయాత్రను రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేనివిధంగా 8 ఎనిమిది రోజులపాటు నిర్వహించారు.చివరి రోజు ములకలచెరువులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి వేలాదిమందికి భోజనాలు ఏర్పాటు చేశారు.ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలు గాయపడిన,అనారోగ్యం బారినపడినా,మరణించినా ఆర్థిక సాయం చేస్తూ వారికి తాను ఉన్నానంటూ భరోసా కల్పిస్తూ మంచితనానికి నిదర్శనంగా నిలుస్తున్నారు.ఇదిలా ఉండగా 2024లో అనూహ్యంగా టిడిపి అధిష్టానం కొత్తవ్యక్తికి టికెట్ కేటాయించింది.తెలుగుదేశం పార్టీ శ్రేణులు,శంకర్ వర్గీయలు ఆయన గెలుపు కోసం పనిచేశాయి.అయినప్పటికీ ఆయన ఓటమిపాలయ్యారు.ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ తంబళ్లపల్లి నియోజకవర్గంలో అసలైన టిడిపి కార్యకర్తలకి న్యాయం జరగలేదని చాలామంది అధిష్టానం ముందు తమగోడును వెళ్లబుచ్చుకున్నారు.అప్పట్లో సీఎం చంద్రబాబు నాయుడు అంగళ్లు పర్యటనలో ఉద్దేశపూర్వకంగానే జి.శంకర్ యాదవ్ పై కేసులు నమోదు చేయకుండా ఆయనపై తప్పుడు సంకేతాలు పంపించారని వాపోతున్నారు.అయితే తెలుగుదేశం పార్టీలో చురుకుగా పనిచేస్తున్న సర్పంచ్ నటరాజ నాయక్,ఐటిడిపి సాగర్ కుమార్లపై కక్ష పెంచుకొని సొంత పార్టీ వారే కొందరు మదనపల్లి సమీపంలోని చిప్పిలి వద్ద విచక్షణ రహితంగా దాడి చేశారు.తీవ్రంగా గాయపడిన వారిని తంబళ్లపల్లె టిడిపి నాయకులు ఆసుపత్రికి తరలించి,ఈ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ కి తెలియజేశారు.ఆయన వెంటనే బెంగళూరు నుండి మదనపల్లెకి చేరుకుని నటరాజ్ నాయక్,సాగర్ కుమార్లను పరామర్శించి వారి కుటుంబాలకు భరోసా కల్పించారు.సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే సమయంలో జాగ్రత్తలు పాటించాలని,పార్టీకి చెడ్డపేరు తెచ్చేవిధంగా వ్యవహరించవద్దని ఆయన హితవు పలికారు.అదేవిధంగా నిర్మాణంలో ఉన్న శ్రీకృష్ణుడి ఆలయానికి రూ.50 వేలు ఆర్థిక సాయం అందజేయడం ఆయన మంచితనానికి నిదర్శనం.ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,మంత్రి నారా లోకేష్,టిడిపి అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు యాదవ్ తెలుగుదేశం పార్టీ ప్రముఖులతో ఆయన మంచి సంబంధాలు కలిగి ఉన్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో 11 నియోజకవర్గాలలో ఇంచార్జిలను మార్చే యోచనలో టిడిపి అధినాయకత్వం ఉండడం,దీంతో మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ కి మళ్లీ తంబళ్లపల్లి నియోజకవర్గం పగ్గాలు అప్పజెప్పాతరనే ఆశతో కష్టకాలంలో పార్టీ కోసం కష్టపడ్డ నాయకులు,కార్యకర్తలు ఆయన అభిమానులు ఉన్నారు.తంబళ్లపల్లి నియోజకవర్గంపై అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించి పార్టీని సమర్థవంతంగా ముందుకు నడిపించగల వ్యక్తికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించాలని కోరుకుంటున్నారు.అదే గనక జరిగితే తంబళ్లపల్లె టిడిపికి మరోవైభవం ఖాయమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :