నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె ఫిబ్రవరి 12 : తంబళ్లపల్లె మల్లయ్య కొండలో గత పాలకులు చేపట్టిన పలు అభివృద్ధి పనులు నాసిరకంగా ఉన్నాయని వాటిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి రికవరీ చేపట్టే విధంగా చర్యలు చేపడతామని తంబళ్లపల్లి ఇంచార్జ్ టిడిపి ఇన్చార్జ్ జయచంద్ర రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన కాలినడకన గత పాలకులు చేపట్టిన గెస్ట్ హౌస్ నిర్మాణం, మరుగుదొడ్లు నిర్మాణాలు నాసిరకంగా ఉన్నాయని విమర్శించారు. దైవ సన్నిధిలో చేపట్టిన పనులలో సైతం ఇంతగా దిగజారడం సిగ్గుచేట న్నారు. నేడు మంజూరైన మరుగుదొడ్లు, ఇతర అభివృద్ధి పనులు నాణ్యత లోపించకుండా నిర్మాణాలు జరిగే విధంగా చూడాలని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. మహాశివరాత్రి పర్వదినాన హాజరయ్యే లక్షలాది భక్తులకు తాగునీటి సౌకర్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆర్డబ్ల్యూఎస్ డి ఈ చంద్రశేఖర్ రెడ్డి, ఎఈ వినోద్ కుమార్, మాధవ రెడ్డిలకు సూచనలు ఇచ్చారు. కొండపై భక్తుల సౌకర్యాల ఏర్పాటులో స్వచ్ఛందంగా సహకరించాలని నాయకులు ఉత్తమ రెడ్డి, బేరి శ్రీనివాసులు, రెడ్డప్ప రెడ్డి, సోమశేఖర్, ఆనంద్ నాయుడులకు సూచించారు.
Reporter
Namitha News