నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తెలుగుదేశం వీరాభిమాని కురువంక మాజీ సర్పంచ్ మోహన పాడెను మోసి న ఎమ్మెల్యే షాజహాన్ భాష... తెలుగుదేశం పార్టీ నాయకులు కురువంక మాజీ సర్పంచ్ మోహన మంగళవారం అనారోగ్యంతో బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు... కుటుంబ సభ్యుల ద్వారా సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే షాజహాన్ భాష బెంగళూరులోని ఆసుపత్రి వద్దకెళ్లి మోహన కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం... రాత్రి 10 గంటల ప్రాంతంలో కురువంకలోని నివాసం వద్ద మోహన పార్టీవ దేహానికినివాళులు అర్పించారు... మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో నిర్వహించిన అంత్యక్రియలలో పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ భాష... మోహన పాడెను మోసి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 25 ఏళ్ల రాజకీయ జీవితంలో పార్టీలకతీతంగా తనతో పాటు పనిచేసిన మోహన మృతి తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, వారు లేని లోటు పార్టీకి తనకు తీరని విషాదం మిగిల్చిందని బాధను వ్యక్తం చేశారు... ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ విద్యాసాగర్,జెసిబి వేణు, కురవ సంఘం రాష్ట్ర నాయకులు బెళ్ళే రెడ్డి ప్రసాద్,జనసేన నాయకులు రామాంజనేయులు, కౌన్సిలర్ నాగార్జున బాబు, మధుసూదన్ రెడ్డి, చిప్పిలి గురునాథ్, పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు...
Reporter
Namitha News