నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 3 ః తంబళ్లపల్లె మండలం లో ఉపాధి హామీ కరువు పనుల కూలీల సంఖ్య పెంచకపోతే కఠినంగా వ్యవహరిస్తామని ఏపీడి నంద కుమార్ రెడ్డి క్షేత్ర సహాయకులను హెచ్చరించారు. మంగళవారం ఉపాధి కూలీలతో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ క్షేత్ర సహాయకులు గ్రామస్థాయిలో పర్యటన చెయ్యకపోవడంతోనే ఈ సమస్య ఏర్పడిందని నిర్లక్ష్యం వీడి కూలీల సంఖ్య పెంచడానికి కృషి చేయాలన్నారు. ప్రతి గ్రామంలో పర్యటించి కూలీలకు ఫారం పాండ్లు, కందకాలు, నీటి ప్రవాహ కాలువలు, చెరువుల ఆయకట్టులో కాలువలు పనులపై దృష్టి సారించాలని అదేవిధంగా పాడి రైతులకు గడ్డి పెంపకంపై అవగాహన పెంచాలన్నారు. అదేవిధంగా యోగాంద్ర రిజిస్ట్రేషన్ చేయించాలని సూచించారు. ఈ సమీక్షలో ఏపీఓ అంజనప్ప, జేఈ మహేష్, టెక్నికల్ అసిస్టెంట్లు సుజాత, పుష్పకుమారి, బాలగంగాధర్, భూదేవి, క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు.
Reporter
Namitha News