నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఏపీఎస్ఆర్టీసీని అభివృద్ధి పథంలో నడిపించండి - నాగూర్ వలికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సూచనలు మదనపల్లె : ఏపీఎస్ఆర్టీసీని అభివృద్ధి పథంలో నడిపించాలని మదనపల్లె - 1,2 డిపోల ఎంప్లాయిస్ యూనియన్ గౌరవాధ్యక్షుడు నాగూర్ వలి (షో ఆప్ శీనా)కి రాష్ట్ర రవాణా,యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సూచించారు.ఆదివారం చిన్నమండ్యం మండలం,పడమటికోన పంచాయతీ,బోరెడ్డిగారిపల్లెలో విరుపాక్షమ్మ బోనాలు అంగరంగవైభవంగా జరిగాయి.ఇందులో భాగంగా మంత్రిని ఆయన నివాసంలో రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు పఠాన్ ఖాదర్ ఖాన్,చీకలబైలు సర్పంచ్ మండ్యం ప్రభాకర్,ప్రవీణ్ రాయల్,నాయి బ్రాహ్మణ సమితి సభ్యులు ప్రభాకర్,సీబిఎన్ రెడ్డి శేఖర్,బండి అమర,టెంపర్ రాజేష్ తదితరులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు.ముందుగా నాగూర్ వలికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నాగూర్ వలి మాట్లాడుతూ మంత్రి ఎంతో ఆప్యాయంగా పలకరించారన్నారు.మండిపల్లి కుటుంబానికి రాయచోటి నియోజకవర్గం ప్రజలకు మంచి అనుబంధం ఉందన్నారు.అంతేకాకుండా ఆయన సూచనలు,సలహాలతో మదనపల్లె ఆర్టీసీ - 1,2 డిపోలను అభివృద్ధి పథంలో నడిపిస్తామని స్పష్టం చేశారు.అనంతరం మంత్రిని శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ బోనాలకు జిల్లా నలుమూలల నుండి ప్రజలు తరలివచ్చి మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.
Reporter
Namitha News