నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఏప్రిల్ 11 : అంగళ్ళు సమీపం లోని మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ (మిట్స్) లోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్) విభాగం వారు ఐ సి టి అకాడమీ వారి ఆధ్వర్యంలో మైక్రోసాఫ్ట్ అజూర్ AI ఎంజినీర్ అసోసియేట్ అనే అంశం పై ఐదు రోజుల ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ రాజలక్ష్మి, సీనియర్ డేటా సైంటిస్ట్, స్ట్రీడొ టెక్నాలిజీస్ ప్రైవేట్ లిమిటెడ్, వేలూరు పాల్గొన్నారు. కార్యక్రమంలో రాజలక్ష్మి మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా అధ్యాపకులు మైక్రోసాఫ్ట్ అజూర్ లోని కాగ్నిటివ్ సర్వీసెస్, కంప్యూటర్ విజన్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, బాట్ సర్వీసెస్ మరియు మెషీన్ లెర్నింగ్ వంటి ఆధునిక టెక్నాలజీలపై అవగాహన పొందారు. హ్యాండ్స్-ఆన్ సెషన్ల ద్వారా వారు ప్రత్యక్షంగా ప్రాజెక్టులు చేయడం ద్వారా ప్రాక్టికల్ అనుభవాన్ని పొందవచ్చన్నారు . పరిశ్రమలు మరియు పరిశోధనలను మార్చడంలో ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ (AI) మరియు మెషిన్ లెర్నింగ్ (ML) కు పెరుగుతున్న ప్రాముఖ్యతను వివరించారు. ముక్యంగా హెల్త్‌కేర్ - AI-ఆధారిత డయాగ్నస్టిక్స్, ప్రిడిక్టివ్ హెల్త్‌కేర్ మరియు బయోఇన్ఫర్మేటిక్స్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్ - ప్రిడిక్టివ్ నిర్వహణ, ప్రాసెస్ ఆప్టిమైజేషన్ మరియు ఖర్చు తగ్గింపు, స్మార్ట్ సిటీలు - AI-ఆధారిత ట్రాఫిక్ నిర్వహణ, పర్యావరణ పర్యవేక్షణ మరియు ఇంధన సామర్థ్యం, విద్య & పరిశోధన - పరిశోధన మరియు పరిశ్రమల మధ్య అంతరాన్ని తగ్గించడానికి విద్యారంగంలో AI/ML యొక్క ఏకీకరణ, నైపుణ్య అభివృద్ధి & కెరీర్ వృద్ధి - వేగంగా అభివృద్ధి చెందుతున్న AI రంగంలో ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడం వంటి అంశాలు ముక్యంగా ఈ కార్యక్రమం లో వివరించారు. ఈ కార్యక్రమం లో పాల్గొనిన అధ్యాపకులకు సర్టిఫికేట్ పంపిణీ చేసారు. ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి. యువరాజ్, విభాగాధిపతి డాక్టర్ పద్మ , శాయీజ్ అహమద్ మరియు అధ్యాపకులు పాల్గొన్నారు.
Admin
Namitha News