నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : శాంతిపురం - మే23: ఈనెల 24,25,26 వ తేదీలలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కుప్పం పర్యటన నేపథ్యంలో అందుకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్ల పై శుక్రవారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తో కలిసి పరిశీలించారు. ఈనెల 25 న శాంతిపురం మండలం కడపల్లి పంచాయతీ శివపురం గ్రామం వద్ద గౌ.రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సొంత ఇంటి గృహప్రవేశం కార్యక్రమం ఉన్నందున ఇందుకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లు, రూట్ మ్యాప్, సంబంధిత అంశాలపై అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైసెనింగ్ (ఏఎస్ఎల్)లో భాగంగా వి.కోట నుండి శాంతిపురం మండలం ముఖ్యమంత్రి గారి సొంతింటి వద్ద, గుడిపల్లి మండలం ద్రావిడ యూనివర్సిటీ గ్రౌండ్ నందు హెలిపాడ్,కుప్పం పి ఈ ఎస్ మెడికల్ వరకు భద్రతా ఏర్పాట్లును పరిశీలించి తగు ఆదేశాలు జారీ చేశారు. వి.కోట నుండి కుప్పం వరకు రోడ్డు ప్రక్కన చెట్లు పొదలు తొలగించి, పారిశుధ్యం నిర్వహణ,హెలిపాడ్, మెడికల్ కళాశాల ముఖ్యమంత్రి గారి సొంతింటి వద్ద పరిసర ప్రాంతాల వద్ద శానిటేషన్ నిర్వహణ చేపట్టాలని పక్కా గా చేయాలని డిపిఓను కలెక్టర్ ఆదేశించారు. ముఖ్య మంత్రి గారి సొంతింటి వద్ద వాహనాల పార్కింగ్ ను ఏర్పాటు చేయాలని,ఆరోగ్య శాఖ వారి బృందం ఉండాలని, టెంపరరీ మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పటిష్ట బ్యారీకేడింగ్ తో పాటు కట్టు దిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని ఎస్పీ ఆదేశించారు. ఈ ఏఎస్ఎల్ కార్యక్రమంలో ఎఆర్ అడిషనల్ ఎస్పీ నందకిషోర్, పిఆర్ఎస్ఈ చంద్రశేఖర్ రెడ్డి,కుప్పం, పలమనేరు ఆర్డిఓలు శ్రీనివాస రాజు,డి పి ఓ సుధాకర్ రావ్, భవానీ,ఏఆర్ డిఎస్ పి.మహబూబ్ బాషా,ఆర్ అండ్ బి. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Admin
Namitha News