Thursday, 16 April 2026 06:19:32 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

నేతన్నలకు ఉచిత విద్యుత్ నిర్ణయం పై హర్ష - సీఎం చంద్రబాబు కు కృతజ్ఞతలు తెలిపిన చేనేత నాయకులు

Date : 04 August 2025 07:34 PM Views : 435

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నేతన్నలకు ఉచిత విద్యుత్ నిర్ణయం పై హర్ష - సీఎం చంద్రబాబు కు కృతజ్ఞతలు తెలిపిన చేనేత నాయకులు మదనపల్లి ఆగస్టు 4, ( మణి నమిత విలేఖరి ) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో చేనేత రంగం కార్మికులకు కూటమి ప్రభుత్వం అండగా నిలిచి ఉచిత విద్యుత్ పథకం అమలుకు శ్రీకారం చుట్టడం పైన తెలుగుదేశం పార్టీ చేనేత రాష్ట్ర నాయకులు బొమ్మి శెట్టి పురుషోత్తం, అమరావతి చేనేత సంక్షేమ సంఘం అధ్యక్షులు యర్ర బల్లి వెంకట రమణ రెడ్డి లు హర్షం వ్యక్తం చేశారు. జాతీయ చేనేత దినోత్సవానికి ముందు రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకానికి ఆమోదం తెలిపడం పైన చేనేత రంగానికి నూతన జవసత్వాలు వస్తాయని ఆకాంక్షించారు. చితికి పోయిన చేనేత రంగానికి ఆగస్టు నెల నుండి ఉచిత విద్యుత్ అమలుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ద్వారా తిరిగి చేనేత మగ్గాల కు పూర్వ వైభవం సంతరించు కుంటుందని అన్నారు. ఈ పథకం ద్వారా గుంత మగ్గాల కార్మిక కుటుంబాలకు 200, మరమగ్గాల కుటుంబాలకు 500 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించడం ఆర్థిక వెసులుబాటు లభిస్తుందని తెలిపారు. ఉచిత విద్యుత్ సరఫరా చేయడం ద్వారా ప్రభుత్వం ఈ పథకానికి రూ.125 కోట్ల వ్యయం చేయడం, రాష్ట్రవ్యాప్తంగా 50 వేల మగ్గాలు, 15 వేల మర మగ్గాలు కలిగిన కుటుంబాలకు ఈ పథకంతో లబ్ధి చేకూర నుందన్నారు. కాగా మదనపల్లి పట్టణం లో సిల్క్ సిటీ గా గుర్తింపు పొందిన నీరు గుట్టు వారి పల్లె చేనేత కార్మిక కుటుంబానికి ఈ పథకం ఎంతో ప్రయోజనం కరంగా ఉంటుందని తెలిపారు. దీనిపై చేనేత కార్మికులు తరపున రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్య మంత్రి చంద్రబాబు కు, మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా కు కృతజ్ఞతలు తెలిపారు. అర్హత కలిగిన ప్రతి చేనేత కుటుంబం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసువాలని కోరారు. అనంతపురం వైద్యం, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): చేనేత రంగంలో కీలక భూమిక పోషించే చేనేత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందజేయనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ప్రక టన చేశారు. దీంతో కూటమి ప్రభుత్వానికి నేతన్నలు కృతజ్ఞతలు తెలి పారు. శ్రీరామానంద చేనేత సంఘం అధ్యక్షుడు నరసింహులు మాట్లా డుతూ కరెంట్ బిల్లుల రూపంలో నేతన్నలు ఆర్థికభారం మోస్తున్నార న్నారు. దీంతో ఒక్కో చేనేత కుటుంబానికి నెలకు దాదాపు రూ.1000 మేర కరెంట్ బిల్లు ఆదా అవుతుందన్నారు. ఉచిత విద్యుత్ ఈనెల నుంచి అమలౌతుందని, వచ్చేనెల నుంచి కరెంటి బిల్లు కట్టాల్సిన అవసరం లేదని అన్నారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ రవీంద్రనాథ్, సభ్యులు భాస్కర్, రామకృష్ణ, ఎర్రిస్వామి, రామానాయుడు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :