నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 2: తంబళ్లపల్లె మండల రెవిన్యూ ఇన్స్పెక్టర్ ముద్దుకృష్ణ మండలంలోని ప్రతి పనికి లంఛం లేనిదే పనిచేయడం లేదని అతనిని వెంటనే సస్పెండ్ చేయాలని రైతు నాయకుడు గంగరాజు సుధాకర్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన తాసిల్దార్ కార్యాలయం ఎదుట మండలంలోని రైతులతో ప్ల కార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తంబళ్లపల్లె తాసిల్దార్ కార్యాలయాన్ని ప్రచారణ చేయాలని, రైతులు, నిరుపేద కక్షిదారులు, విద్యార్థులు నుండి పాస్బుక్కులు, సర్టిఫికెట్లు మంజూరు ఇలా ఏ సమస్య వచ్చినా లంచం ఇవ్వకపోతే పని చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డులు అన్ని సక్రమంగా ఉన్నా ఏదో ఒక సాకు చెప్పి లంచం డిమాండ్ చేస్తుంటారని వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని అతనికి సహకరిస్తున్న అధికారులపై చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్ లకు ఫిర్యాదులు పంపినట్టు చెప్పారు. ఈ ఆందోళన కార్యక్రమంలో మండలంలోని రైతులు, వినియోగదారులు పాల్గొన్నారు.
Reporter
Namitha News