నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి.కొత్తకోట తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రికత నెలకొంది. బి.కొత్తకోట మండలం గుమ్మసముద్రం గ్రామం రీసర్వేలో భారీ అవకతవకలు జరిగాయని రైతులు ఆరోపించారు. గుమ్మ సముద్రం గ్రామంలో ఏ ఒక్క రైతుకి 1-బి రాలేదని వాపోయారు. గుమ్మసముద్రం గ్రామంలోని దేవుని మాన్యం భూమిని విలేజ్ సర్వేయర్ రాజేంద్ర తన సొంత తల్లి పేరు మీద ఆన్‌లైన్ చేసుకున్నారని రైతులు ఆరోపించారు. పెట్రోల్ బాటిల్, ఉరితాళ్ళతో పురుగులు మందు డబ్బాలతో బి.కొత్తకోట తహసిల్దార్ కార్యాలయం ఎదుట నిలిచి తమ సమస్య తీర్చాలంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడానికి గుమ్మసముద్రం గ్రామం రైతులు సిద్ధపడ్డారు. గుమ్మసముద్రం వీఆర్వో కోటిరెడ్డి పై తహసీల్దార్ కార్యాలయం ఎదుట గండువారిపల్లి గ్రామస్తులు తిరగబడ్డారు. అవకతవకలకు పాల్పడిన విఆర్వో, సర్వేయర్ లను వెంటనే సస్పెండ్ చేయాలని రైతులు డిమాండ్ చేశారు. తాను కొత్తగా వచ్చానని తనకు తెలియదని సమస్య పరిష్కారం చేస్తానని తహసిల్దార్ చెప్పారు. కలెక్టర్ స్వయంగా వచ్చేంతవరకు ఇక్కడి నుంచి కదిలేదేలేదంటూ … గుమ్మసముద్రం గ్రామం రైతాంగం బైఠాయించి ఆందోళన చేపట్టారు. గత ప్రభుత్వంలో చేసిన రిసర్వేలలో బి.కొత్తకోట, పెద్ద తిప్పసముద్రం మండలంలో చాలా అవినీతి జరిగిందని అన్నారు. రైతులు చాలావరకు తమ భూములను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వేయర్ లు చేసిన అవకతవకల్లో గ్రామస్తులు అందరి భూములకు జాయింట్ ఎల్‌పిఎం లు చేయడంతో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని దీనికి ఉన్నతాధికారులు పరిష్కారం చూపాలని లేనిపక్షంలో ఆత్మహత్యే శరణ్యం అని రైతాంగం కంటతడిపెట్టారు. బి.కొత్తకోట తహసిల్దార్ మహమ్మద్ అజారుద్దీన్ రైతులతో మాట్లాడుతూ … వచ్చే సోమవారం నుండి వారి సమస్యలను పరిష్కరించడానికి కఅషి చేస్తానని తెలపడంతో రైతులు ఆందోళన విరమించారు. బి.కొత్తకోట మండలం గండువారిపల్లికి చెందిన సుదర్శన్ అనే రైతు తన కుమార్తె కాలేజీ ఫీజు కోసం తన స్థలాన్ని అమ్మడం కోసం వెళితే వన్ బి రాలేదని, మొత్తం వన్ బి జాయింట్ ఎల్పీఎంలో ఉందని అమ్మటానికి వీలు కాలేని పరిస్థితిలో ఒకవైపు తన కుమార్తె చదువు ఆగిపోతుందని తీవ్ర ఆవేదనకు గురై పురుగుమందు డబ్బాతో ఆత్మహత్యే శరణ్యమంటూ తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నానికి రైతు పాల్పడ్డారు.
Admin
Namitha News