నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : వాయల్పాడు.: చింతపర్తి పి.హెచ్.సి. పరిధిలోని గండబోయిన పల్లి లో నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్ ను అన్నమయ్య జిల్లా డి.ఎమ్.హెచ్.ఓ.డాక్టర్ కొండయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా డి.ఎమ్.హెచ్.ఓ.డాక్టర్ కొండయ్య వైద్య శిబిరానికి వచ్చిన రోగుల తో మాట్లాడి వారికి అందుచున్న సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ వైద్య శిబిరాలలో ఎముకలు,కీళ్లు, నరాల నిపుణులు, కంటి వైద్యులు జెనరల్ సెర్జన్ ,స్త్రీల వైద్య నిపుణులు వంటి వారి సేవలు అందుబాటులోకి తెచ్చామని కావున ప్రజలు ఈ సేవలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.105 రకాల మందులు,14 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. అనంతరం ఇక్కడ స్టాల్స్ ను పరిశీలించారు మొత్తం 192 మందికి మధ్యాహ్నం 1.00గం చూడటం జరిగింది అని సాయంత్రం 4.00గం వరకు క్యాంప్ ని ర్వహిస్తారని అన్నారు. ఈకార్యక్రమంలో చింతపర్తి పి.హెచ్.సి వైద్యులు డాక్టర్ వాసీమ్ ,ఆర్థోపెడిక్ వైద్యులు శశిభూషన్ రెడ్డి, డాక్టర్ అవినాశ్ సి.హెచ్.ఓ ఇందిర, హెల్త్ ఎడ్యుకేటర్ మహమ్మద్ రఫీ,ఆరోగ్య పర్యవేక్షకులు సుధాకర్,భానుభి మరియు ఎమ్.ఎల్.హెచ్ప్,ఏ. ఎన్. ఎమ్ లు ఆశాకార్యకర్తలు, వ్వాలంటీర్ లు పాల్గొన్నారు
Reporter
Namitha News