నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కురబల కోట - జనవరి 27 : కురబలకోట మండలం లో ప్రభుత్వ ఆదేశాల మేరకు వికలాంగులు పెన్షన్లు తనిఖీని నేడు కొనసాగింది. కురబల కోట మండలం లోని పంచాయతీలలో వైద్య నిపుణుల బృందం క్షేత్ర స్థాయి లో వికలత్వం శాతం ను పరిశీలించారు . పిహెచ్ సి పెన్షన్ దారులను విచారించి వారి ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీశారు. ప్రతి ఒక్కరిని వ్యక్తిగతం గా వారికి ఇచ్చిన సర్టిఫికెట్ల వికలాంగ పర్సంటేజీ పరిశీలించి నేడు లబ్ధిదారుడు ఉండే స్థితి పై కూలంకషంగా పరిశీలన జరుపుతున్నట్ల ఎంపీడీఓ తెలిపారు. ఆయన వెంట వైద్య సిబ్బంది, పంచాయితీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Namitha News