నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - డిసెంబర్ 06 : మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్, మదనపల్లె కళాశాల నందు ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ ఇంటరాక్షన్ సెల్ (IIIC) వారు వి.డి.టి ఈడియు తంత్ర ప్రైవేట్ లిమిటెడ్ (VDT Edu Tantr Pvt. Ltd ), బెంగళూర్ వారి పరస్పర సహకారంతో "అగ్‌మెంటెడ్ రియాలిటీ మరియు వర్చ్యువల్ రియాలిటీ" అనే అంశంపై ఒక్కరోజు హాండ్స్ ఆన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిధిగా బెంగళూరుకు చెందిన వేణు శ్రీనివాస్, డైరెక్టర్, దీపక్ కుమార్,డైరెక్టర్, మరియు వినోత్, ఇన్స్ట్రక్టర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ వేణు శ్రీనివాస్ మాట్లాడుతూ అగ్‌మెంటెడ్ రియాలిటీ అనేది ఒక భౌతిక, వాస్తవ ప్రపంచ పర్యావరణ వీక్షణ సాంకేతికత. దీని అంశాలు ధ్వని, వీడియో, గ్రాఫిక్స్ లేదా జిపిఎస్ డేటా వంటి కంప్యూటర్ - జెనరేటెడ్ సెన్సారి ఇన్‌పుట్ ద్వారా అభివృద్ధిచేయబడతాయి. ఈ సాంకేతికత ద్వారా మనిషి చూసే దృశ్యంలో ఊహాత్మక వస్తువులను ప్రవేశపెట్టినట్లు, ఉన్న దృశ్యంలో వస్తువులను తొలగించినట్టు చూపెట్టవచ్చు. ఇది ఒక కంప్యూటర్ సిస్టం ద్వారా నిరంతరం జరిగే ప్రక్రియ, దీని ఫలితంగా మనిషి చూసే దృశ్యాన్ని వేరే దృష్టికోణంలో చూడగలిగే అవకాశాన్ని ఇది మనకి అందిస్తుంది. దీనికి భిన్నంగా, వర్చ్యువల్ రియాలిటీ సాంకేతికతో మనిషి చూసే వాస్తవ దృశ్యాన్ని పూర్తిగా కంప్యూటర్ ద్వారా కల్పిత దృశ్యంతో భర్తీ చేస్తుంది. ఇలాంటి సాంకేతికత ద్వారా విద్యార్థులలో గ్రాఫిక్స్ లో నైపుణ్యాన్ని పెంపొందిచుకోవడంలో సహకరిస్తాయని అన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి యువరాజ్, ఈవెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ స్వప్నిల్ జైస్వాల్, కోఆర్డినేటర్ డాక్టర్ వి. నవీన్ మరియు వివిధ విభాగాలకు చెందిన అధ్యాపకులు మరియు 80 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
Namitha News