నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - సెప్టెంబరు 29 : రాష్ట్ర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి ఏ.పీ.ఏ.ఐ.సి.సి. డైరెక్టర్ గా నియమితులైన మై ఫోర్స్ మహేష్ ను మదనపల్లి లోని వారి కార్యాలయం లో మర్యాద పూర్వకంగా కలిసిన గుర్రంకొండ జనసేన నాయకుడు నక్కా గోపాలకృష్ణ(గోపీ), నక్కారాము తదితరులు అనంతరం పుష్పగుచ్చం అందించి, దుస్సలవ తో ఘనంగా సన్మానించిన జనసైనికులు. ఈ సందర్భంగా గుర్రంకొండ జనసేన నేతలు మాట్లాడుతూ పీలేరు నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటు కోసం కృషిచేసి నిరుదోగ్య యువతకు ఉదోగ్యాలు కల్పించాలని కోరారు. నిరుద్యోగ యువత ఉదోగ్యాల కల్పనకు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ కృషితో రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెద్దపీట వేశారని ఏపీఐఐసీ డైరెక్టర్ మైఫోర్స మహేష్ పేర్కొన్నారు. కార్యక్రమం లో గుర్రంకొండ జనసేన పార్టీనేతలు, హౌస్పైడ్ నక్కాగోపాలకృష్ణ(గోపీ), నక్కా రాము, గాజుల శ్రీను రాయల్, రితీష్, ఉదయ్, తదితరులు పాల్గొన్నారు
Admin
Namitha News