నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె నవంబర్ 17 : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు మాజీ దివంగత చంద్రగిరి ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మృతికి తంబళ్లపల్లె టిడిపి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం ఎన్టీఆర్ ఘాట్ లో మండల పార్టీ అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి ఆధ్వర్యంలో నారా రామ్మూర్తి నాయుడు చిత్రపటానికి పూజలు నిర్వహించి ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మహిళా నేత సిద్ధమ్మ, బిసి నాయకుడు పురుషోత్తం, క్లస్టర్ ఇంచార్జ్ బేరి శ్రీనివాసులు, మండల ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి నాయుడు, మాజీ జడ్పిటిసి రామచంద్ర, తెలుగు యువత నియోజకవర్గ ఉపాధ్యక్షుడు నరసింహులు, రాజంపేట బిసి టిడిపి కార్యదర్శి సోమశేఖర్, ఎర్రసానిపల్లి సుధాకర్, రామచంద్రారెడ్డి, మల్లికార్జున,కన్నెమడుగు సురేంద్ర, సుధాకర్ రెడ్డి, సామి రెడ్డి, సాంబశివారెడ్డి, గట్టుమీద శంకర్ రెడ్డి, కాలా నారాయణ, పీర్ల మాబు, రామ్మోహన్ రెడ్డి, గోపి దిన్ని సుధాకర్, మెకానిక్ భాష, దివ్యాంగుల అధ్యక్షుడు రామాంజులు పాల్గొన్నారు.
Reporter
Namitha News