నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : సర్వే నెంబర్ 552 లోని ప్రభుత్వ భూమిని గుర్తించి బోర్డు ఏర్పాటు చేయడం హర్షనీయ్యం కబ్జాలపై ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలి. మదనపల్లి ఫైల్ల విషయాన్ని ఆటకెక్కించిన రాష్ట్ర ప్రభుత్వం సిపిఐ నాయకులు కృష్ణప్ప,సాంబ, మురళి. మదనపల్లి మండలం బికేపల్లి రెవెన్యూ పంచాయతీలో సర్వేనెంబర్ 552/1 లో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి ప్రభుత్వ భూమిని గుర్తించి,ప్రభుత్వ బోర్డు ఏర్పాటు చేయడాన్ని సిపిఐ నాయకులు స్వాగతించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కృష్ణప్ప,సాంబ,నియోజకవర్గ కార్యదర్శి మురళి మాట్లాడుతూ మదనపల్లి పరిసర ప్రాంతాల్లో కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములు కబ్జాలు జరుగుతున్నాయని అనేకసార్లు రెవెన్యూ అధికారుల దృష్టికి,జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లినప్పుడు కూడా ఏ ఒక్క అధికారి కూడా స్పందించలేదన్నారు. గతంలో సర్వే నెంబరు 552 లో ప్రభుత్వ భూమి వాటర్ షేడ్ పుడ్చేసి వెంచర్ వేశారని,సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద అనేక సార్లు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించామని, రెవెన్యూ దృష్టికి తీసుకెళ్లామని,అప్పుడు ఏ ఒక్క రెవెన్యూ అధికారి కూడా స్పందించలేదని,ఇప్పటికైనా ఆ భూమిని సర్వే నిర్వహించి ప్రభుత్వ భూమిగా గుర్తించి బోర్డును ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా మదనపల్లిలో కోమిటి వారి చెరువు 18 ఎకరాలు,స్వామి చెరువు,అమ్మ చెరువు,కురవంక కాలువ,బహుద కాలవలు పూర్తిగా కబ్జా అయ్యాయని కమర్షియల్ బిల్డింగులు నిర్మిస్తున్నారని,వీటి పైన కూడా జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ వహించి ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని,కబ్జాలను తొలగించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సిపిఐ పార్టీగా కోరారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన పైల్ల సంఘటనను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నీరు కార్చేసిందని,దోషులను కాపాడి,బాధితులను కడుపు కొడుతుందన్నారు.భూబాధితులకు ఏమాత్రం భరోసా ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పైలూర్ అయిందని,ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మదనపల్లి పైళ్ల విషయంలో కబ్జాదారుల చేతుల్లో చిక్కుకున్నటువంటి భూ బాధితులకు న్యాయం చేయాలని సిపిఐ గా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు తిరుమల,మాధవ్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News