నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె ఆగస్టు 16 : అమెరికాలో ఆర్థికంగా స్థిరపడి తాము జన్మించిన జన్మభూమిలోని విద్యార్థులకు ప్రతి యేటా స్కాలర్షిప్ ల రూపంలో దాతృత్వం ప్రకటిస్తున్న నాగభూషణం, పద్మ దంపతులు అందరికీ ఆదర్శనీయమని అన్నమయ్య జిల్లా బిజెపి అధ్యక్షుడు సాయి లోకేష్ కుమార్ కొనియాడారు. తంబళ్లపల్లె హైస్కూల్లో ప్రతి ఏటా ఉత్తమ ప్రతిభ కనపర్చిన విద్యార్థులకు తంబళ్లపల్లెకు చెందిన దివంగత కరణం పి చెంగల్ రావు, ఆది లక్ష్మమ్మ దంపతుల స్మారకార్థం ఆయన కుమారుడు నాగభూషణరావు, పద్మ దంపతులు స్కాలర్షిప్లు పంపిణీ చేయడం పరిపాటి. శుక్రవారం హై స్కూల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 30 మంది విద్యార్థులకు 2000 చొప్పున స్కాలర్షిప్లు పాఠశాల కమిటీ చైర్మన్ శివకుమార్, ఎన్నారై దంపతుల ప్రతినిధి రామి గాని పల్లి శంకర్ రెడ్డి, హెడ్మాస్టర్ లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అమెరికాలో ఉన్నా తమ జన్మభూమిలోని విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని తపిస్తున్న ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని ప్రశంసల జల్లు కురిపించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మగ్గాలు లక్ష్మయ్య, మండల బిజెపి అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
Namitha News