నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - సెప్టెంబర్ 05 : అంగళ్ళు సమీపం లోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు ఒణం పండుగను విద్యార్థులు ఆనందోత్సాహాలతో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా యూనివర్సిటీ ప్రో-ఛాన్సలర్ యెన్ ద్వారకానాథ్ గారు పాల్గొని, పండుగలు మన సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకలు అని. ఒక్కో రాష్ట్రంలో జరుపుకునే పండుగలు ఆయా రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబిస్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి, తెలంగాణలో బతుకమ్మ, బోనాలు, తమిళనాట దీపావళి ఎంత ప్రసిద్ధి చెందాయో, కేరళ రాష్ట్ర పండుగ ఓనం కూడా ఆ రాష్ట్ర సంస్కృతికి ప్రతీక అని అన్నారు. ఈ ఒణం పండుగ సమానత్వం, ఐకమత్యం, సంతోషాన్ని ప్రతిబింబిస్తుందని, విద్యార్థులు ఇలాంటి వేడుకల ద్వారా భారతీయ సంప్రదాయాల వైభవాన్ని తెలుసుకోవాలని సూచించారు. భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లుగా వర్ణిస్తూ యూనివర్సిటీ లోని విద్యార్థులు కేరళ సంప్రదాయాలకు అనుగుణంగా పూలతో అలంకరించిన పువ్వుల ముగ్గు, సాంప్రదాయ నృత్యాలు, పాటలు, ఆటలతో వేడుకలను ఉత్సాహభరితంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్ట్స్ అండ్ కల్చరల్ కోఆర్డినేటర్ వై ప్రదీప్ కుమార్, సాక్ కోఆర్డినేటర్ డాక్టర్ రెడ్డి హేమంత, ఫ్యాకల్టీ సభ్యులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Admin
Namitha News