నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై 09 ః తంబళ్లపల్లె ఐసిడిఎస్ పరిధిలోని అంగన్వాడీలు సిఐటియు ఆధ్వర్యంలో తమ సమస్యల పరిష్కారానికి బుధవారం నిరసన ర్యాలీతో పాటు ఆందోళన చేపట్టారు. ఉదయం క్రాస్ రోడ్ నుండి తంబళ్లపల్లె పురవీధుల్లో ర్యాలీతోపాటు వైయస్సార్ సర్కిల్లో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడి వర్కర్స్ అండ్ యూనియన్ మహిళా నేత సులోచన మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనం26000 చెల్లించాలని, లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలు పరిరక్షించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.
Reporter
Namitha News