నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - సెప్టెంబర్ 26 : అన్నమయ్య జిల్లా వారిది చాలా నిరుపేద కుటుంబం. బండ పని వారి కులవృత్తి. తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చిన్నతనం నుండి చూశాడు. తల్లిదండ్రుల కష్టాలను తీర్చి సంతోషపరచాలని అనుకున్నాడు. తాను టీచర్ అయితే కుటుంబ కష్టాలు తీరుతాయని భావించారు. ఉపాధ్యాయుడు కావాలన్న కోరిక ప్రకారం చాలా కష్టపడ్డాడు. ప్రభుత్వం ఎప్పుడైనా ఉపాధ్యాయుల భర్తీ చేస్తుందన్న నమ్మకంతో ఏకాగ్రతతో చదివారు. నమ్మిన ప్రకారం ప్రస్తుత ప్రభుత్వం టీచర్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ డీఎస్సీలో ఎలాగైనా టీచర్ పోస్ట్ సాధించాలని పట్టు వదలని విక్రమార్కుడిలా రాత్రింబవళ్లు చదివారు. డీఎస్సీలో సెలెక్ట్ అయ్యి ఉపాధ్యాయుడిగా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నారు. తన కల నెరవేరినందుకు ఎంతో సంబరపడ్డాడు. అతనే మునిబోయుని సుబ్రమణ్యం. రామసముద్రం మండలం, తిరుమలరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎం.సుబ్రహ్మణ్యం గురువారం విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా డీఎస్సీలో సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. విజయవాడకు సుబ్రహ్మణ్యం వెళ్లి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నారు. ప్రభుత్వ టీచర్ గా నియమితులు కావడంతో ఆ కుటుంబంలో సంతోషాలు వెలివెత్తాయి. తల్లిదండ్రులు ఆనందమ్మ, శ్రీరామప్ప, అన్న మల్లికార్జున, వదిన అమరావతి, భార్య సులోచన సుబ్రహ్మణ్యంకు అభినందనలు తెలిపారు.
Admin
Namitha News