నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె నవంబర్ 15 ( నమిత న్యూస్ ప్రతినిధి) ః దశాబ్దాలుగా అణగారిన మాదిగ జాతిని ఉద్యమాలతో మేల్కొల్పి నేడు జాతి తల ఎత్తుకునేలా నిలిచిన పోరాటయోధుడు మందకృష్ణ మాదిగ జాతికి ఆదర్శప్రాయుడని తంబళ్లపల్లె మాదిగ ఉద్యోగ ఫెడరేషన్ నాయకులు గంగాధర్, అంజనప్పలు కొనియాడారు. శుక్రవారం మదనపల్లెలో మాదిగ ఉద్యోగ సంఘ ఫెడరేషన్ నాయకులు మందకృష్ణ మాదిగను కలుసుకొని పూల బొకేలు, దృశ్యాలవులతో ఘనంగా సత్కరించి జాతి కోసం ఆయన చేస్తున్న సేవలను కొనియాడుతూ భావితరాలు అంబేద్కర్ తర్వాత మీ స్థానం మాదిగల హృదయాలలో నిలిచి అభినవ అంబేద్కర్ గా మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని ప్రశంసలతో ముంచెత్తారు. ఈ సన్మానంలో మాదిగ ఉద్యోగ సంఘ ఫెడరేషన్ సభ్యులు టి ఓ చిన్నప్ప, గంపల శ్రీనివాసులు, టీచర్ రమణ, చిట్టిబాబు, ఓ వి రమణ, విశ్వనాథ్, నరసింహులు పలువురు ఎం ఈ ఎఫ్ సభ్యులు పాల్గొన్నారు.
Reporter
Namitha News