నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - అక్టోబర్ 30 : అంగళ్ళు సమీపం లోని మిట్స్ డీమ్డ్ టూ బీ యూనివర్సిటీ కు యెన్.సి.సి లెఫ్టినెంట్ కల్నల్ హెచ్. లలిత్ బాబు, అడ్మిన్ ఆఫీసర్ 30 ఆంధ్ర బెటాలియన్, కడప, లెఫ్టినెంట్ కల్నల్ పి. లోగనాథన్ మరియు నాయక్ సుభేదర్-వేత్రయాన్.వి, 35 ఆంధ్ర బెటాలియన్, చిత్తూర్ వారి తో ఇంటరాక్షన్ సెషన్ ను నిర్వహించినట్లు యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్. సి. యువరాజ్ అన్నారు. కార్యక్రమంలో యెన్.సి.సి విద్యార్థుల ట్రైనింగ్ సదుపాయాలు, ప్యారేడ్ గ్రౌండ్, శిక్షణ పరికరాలు, కేడెట్లకు అందుబాటులో ఉన్న మౌలిక వసతులు ను సందర్శించారు. కార్యక్రమంలో లెఫ్టినెంట్ కల్నల్ హెచ్.లలిత్ బాబు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద యూనీఫాం యువజన దళంగా ఎన్సీసీ ప్రసిద్ధి పొందింది అని, రేపటి పౌరుల్లో క్రమశిక్షణ, సేవాభావం, దేశభక్తి, నాయకత్వ లక్షణాలు పెంపొందించడంలో ఎన్సీసీ ఎంతో ప్రసిద్ధి చెందిందని అన్నారు. ఆధునిక విద్యా వ్యవస్థలో ప్రతి విద్యార్ధి కి ఎన్సీసీ చోటు కల్పించాల్సిన అవసరం ఎంతో ఉందని, ఎన్సీసీ క్యాడెట్ వారానికి కనీసం నాలుగు గంటల సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది అని అన్నారు. ఎన్సీసీలో శిక్షణ అనంతరం అందించే ఏ, బీ, సీ సర్టిఫికెట్లు విద్యార్థుల ఉన్నత విద్య, ఉద్యోగాలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి అని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు యెన్.సి.సి సెరిటిఫికేట్ కు ప్రత్యేక కోటా ఉంటుందని అన్నారు. సీ సర్టిఫికెట్ పొందిన అభ్యర్థులకు ప్రత్యేక డ్రైవ్ ద్వారా ఆర్మీలో అవకాశం కల్పిస్తారు అని, ఎన్సీసీ ఏ, బీ, సీ సర్టిఫికెట్లు కలిగిన వారికి పోలీస్ నియామక పరీక్షల్లో అదనంగా మార్కులు కేటాయిస్తారు అని అన్నారు. వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, నిఘా, భద్రత, సెక్యూరిటీ ఉద్యోగాల్లో వీరికి ప్రాధాన్యం లభిస్తుంది అని అన్నారు. క్యాడెట్స్ వీటిపై అవగాహాన పెంచుకోవాలని ఆయన అన్నారు. కార్యకమం లో యెన్.సి.సి లెఫ్టనెంట్ డాక్టర్ నవీన్ కుమార్ మరియు యెన్.సి.సి విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
Namitha News