Thursday, 16 April 2026 06:11:42 PM
# వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు

చంద్రబాబు కు కుప్పం ముస్లిం ల ఇప్తార్ విందు

Date : 25 March 2024 10:13 PM Views : 158

నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : ముస్లింల భద్రతకు నాదీ బాధ్యత నేనున్నంతకాలం ముస్లింలకు అన్యాయం జరగదు రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా కేంద్ర సాయం అవసరం ఎన్నడూ లేని విధంగా జగన్ హయాంలో ముస్లింలపై దాడులు ముస్లింలకు పథకాలు రద్దు చేశాడు...ఆర్థిక సాయం నిలిపేశాడు ముస్లింల హక్కులకు భంగం కలిగే చర్యలు మేము ఏనాడూ తీసుకోలేదు - టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పంలోని KVR మండపంలో ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొన్న చంద్రబాబు కుప్పం : రంజాన్ మాసం అంతా సూర్యాస్తమయం వరకూ నీళ్లు, ఆహారం తీసుకోకుండా కఠోరమైన దీక్షను ముస్లిం సోదరులు చేపడతారు. ముస్లింలకు న్యాయం చేసిన ఏకైక పార్టీ టీడీపీ. 40 ఏళ్లుగా ముస్లింలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. ఉర్దూను రెండో భాషగా చేసింది టీడీపీనే. సమైక్యరాష్ట్రంలో 13 జిల్లాల్లో ఉర్దూను రెండో భాషగా చేశాను. ముస్లింలో చాలా మంది పేదలు ఉన్నారని గుర్తించిన ఎన్టీఆర్ 1985లో దేశంలోనే మొదటిసారిగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించారు. హజ్ యాత్రకు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారు..హైదరాబాద్ లో హజ్ హౌస్ కట్టి విమాన సదుపాయాన్ని కల్పించాం. రాష్ట్రం విడిపోయాక కడప, విజయవాడలో హజ్ హౌస్ ల నిర్మాణం చేపట్టి 90 శాతం పూర్తి చేశాం. కానీ వాటిని ఈ ప్రభుత్వం పూర్తి చేయలేదు. సమైక్య రాష్ట్రంలో ఉర్దూ యూనివర్సిటీని హైదరాబాద్ కు తెచ్చాం...విభజన తర్వాత కర్నూలుకూ తెచ్చాం. ఖురాన్ స్ఫూర్తితో పేద ముస్లింలైన 10 లక్షల మందికి రంజాన్ తోఫా ఇచ్చాం. దుకాన్ మకాన్, దుల్హన్ పథకాలను ప్రవేశపెట్టాం. 33 వేల మందికి దుల్హన్ పథకం ద్వారా రూ.165 కోట్లు ఆర్థిక సాయం ఇచ్చిన ఏకైక పార్టీ టీడీపీ. విదేశీ విద్య కింద 527 మందిని విద్యార్థులను విదేశాలకు పంపించాం. కానీ ఈ ప్రభుత్వం ఎవరికీ డబ్బులు ఇవ్వలేదు. ఒక్క మైనారిటీ సోదరుడికైనా ఆర్థిక సాయం అందించిందా..? ఒక్క మసీదైనా కట్టారా.? ఆఖరికి మరమ్మతులకు కూడా డబ్బులు ఇవ్వలేదు. నాడు నేను రూ.3 లక్షల రుణం ఇచ్చి రూ.లక్ష సబ్సీడీ ఇచ్చా. ఇమామ్, మౌజన్ లకు గౌరవ వేతనం ఇచ్చింది టీడీపీనే. కానీ 6 నెలలుగా ఈ ప్రభుత్వం గౌరవ వేతనం ఇవ్వడం లేదు. నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబాన్ని వేధించడంతో ఆత్మహత్య చేసుకుంది. ఎమ్మిగనూరులో హజీరాబీ అనే ముస్లిం యువతిని కొందరు వైసీపీ గూండాలు అత్యాచారం చేసి చంపేస్తే పట్టించుకోలేదు. వి.కోటలో చదువుల తల్ల మిస్బా బాగా చదువుతుంది...కానీ వైసీపీ నేత కూతురు సెకెండ్ వస్తోందని మిస్బాకు టీసీ ఇవ్వడంతో ప్రాణాలు వదిలిపెట్టింది. మస్లిం ఆడబిడ్డ బాగా చదువుకుంటే మనసు ఒప్పలేని దుర్మార్గులు వీళ్లు. కళ్యాణదుర్గంలో చాపిరి గ్రామంలో యువతిని మోసం చేసి చంపి నందిలో పడేశారు. దాచేపల్లిలో అలీషా మద్యం అమ్ముతున్నాడని నింద వేసి కొట్టి చంపేశారు. కడపలో అక్బర్ బాషాకు చెందిన భూమిని కబ్జా చేయడంతో ఆత్మహత్యకు యత్నించాడు. ముస్లిం యువకులపై పుంగనూరులో కేసులు పెట్టి 12 మందిని జైలుకు పంపారు. మసీదును కబ్జా చేస్తున్నారని పోరాడినందుకు నరసరావుపేటలో ఇబ్రహీంను నరికి చంపారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా.? 45 ఏళ్ల ట్రాక్ రికార్డు ఉన్న పార్టీ టీడీపీ. ఎన్డీయేలో ఉన్నప్పుడు కూడా గతంలో మీ హక్కులకు భంగం కలిగే చర్యలు ఏనాడూ చేయలేదు. మీ పిల్లల అభివృద్ధి కోసం కృషి చేశాం. పార్లమెంట్ లో అన్ని చట్టాలకు వైసీపీ ముందుండి మద్ధతు ఇచ్చింది. రాష్ట్రంలో రాక్షస ప్రభుత్వం ఉంది..అందరిపై దాడులు చేస్తున్నారు..అందుకే నేను, పవన్ ఆలోచించి బీజేపీ ముందుకు రావడంతో పొత్తు పెట్టుకున్నాం. ముస్లింలకూ పనులు కావాలన్నా...అభివృద్ధి చెందాలన్నా కేంద్ర ప్రభుత్వ సాయం కావాలి...అందుకే పొత్తు పెట్టుకున్నాం తప్ప మరో కారణం కాదు. 3 పార్టీలు రాష్ట్ర భవిష్యత్తు కోసమే పొత్తు పెట్టుకున్నాయి. నేను సీఎంగా ఉన్నంత కాలం మీకు అన్యాయం జరగదు. దుర్మార్గ ప్రభుత్వం వస్తే మీకూ భవిష్యత్తు ఉండదు. ముస్లింలు, క్రిస్టియన్లు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. అందరినీ సమానంగా చూసి, అందరికీ సంక్షేమాన్ని అందించే ఏకైక పార్టీ టీడీపీ. ప్రతి ఒక్కరికీ న్యాయం జరగలాన్నదే నా తపన. ముస్లింలకు ఏం కావాలన్నా నేను ముందుంటా. ముస్లిం సోదరులు ఏదీ మనుసులో పెట్టుకోకుండా ముందుకు రావాలి. ముస్లింల భద్రతకు నాది బాధ్యత.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :