నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె ఏప్రిల్ 9 : తంబళ్లపల్లె మండలం లో మంగళవారం స్థానిక ప్రజలు ఉగాది పండుగ ను ఘనంగా జరుపుకున్నారు. పండుగ సందర్భంగా ప్రజలు ఉగాది పచ్చడి విశిష్టత గురించి తమ భావితరాల పిల్లలకు వివరించడం విశేషం. మండల కేంద్రానికి సమీపంలోని మల్లయ్య కొండలో మహా శివునికి వందలాది మంది భక్తులు ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. అదేవిధంగా కోసువారిపల్లి శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర ఆలయం, కుక్క రాజు పల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయం, తంబళ్లపల్లె రామాలయం, శివాలయం, శిరిడి సాయిబాబా ఆలయాలలో వందలాదిగా భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు పొందారు. ఉగాది పండుగ సందర్భంగా స్థానిక ముస్లిం సోదరులు వారికి ఉగాది పండుగ శుభాకాంక్షలు అందజేశారు.
Admin
Namitha News