నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె టికెట్ ఏకపక్ష నిర్ణయం తగదు. టిడిపి జిల్లా సెక్రెటరీ కసెట్టి వెంకటరమణ. తంబళ్లపల్లె నియోజకవర్గం అసెంబ్లీ టికెట్ దాసిరిపల్లి జయచంద్రారెడ్డి కి ఇవ్వడం ఏకపక్ష నిర్ణయమని ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న వారికి న్యాయం జరగలేదని టిడిపి జిల్లా సెక్రెటరీ వెంకటరమణ కోరారు. ఆదివారం ఆయన టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడు కు లేఖ రాస్తూ ఏనాడు పార్టీ జెండా మోయని నాయకులకు పార్టీ టికెట్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని తంబళ్లపల్లి నియోజకవర్గం లోని 6 మండలాల తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం అసహనం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. పార్టీ టికెట్ విషయంలో నాయకులందరి సలహాలు సూచనలు లేకుండా ఓ వర్గానికి చెందిన నాయకున్ని ఎంపిక చేయడం స్థానిక నాయకులు జీర్ణించుకోలేకపోతున్నట్లు చెప్పారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, ఎన్టీఆర్ అభిమానులు, ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని తంబళ్లపల్లె పార్టీ టికెట్ విషయంలో పునరాలోచించాలని కోరారు.
Reporter
Namitha News