నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె నియోజకవర్గం అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి - పీకేఎం - ఉడా చైర్మనుకు తెలుగుదేశం నాయకులు విజ్ఞప్తి మదనపల్లె : మదనపల్లె నియోజకవర్గం అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పలమనేరు,మదనపల్లి,తంబళ్లపల్లి,కుప్పం,పుంగనూరు నియోజకవర్గాల పీకేఎం - ఉడా చైర్మన్ డాక్టర్ బి.ఆర్.సురేష్ బాబుని తెలుగుదేశం నాయకులు కోరారు.మంగళవారం రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు పఠాన్ ఖాదర్ ఖాన్,విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ రామకృష్ణ ఆచారి,ఏపీఎస్ ఆర్టీసీ 1,2 డిపోల ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు నాగూర్ వలి,9వ వార్డు ఇంచార్జి బాబు నాయుడు,ముదివేడు అయూబ్ బాషా,మోహన్ రెడ్డి,బావాజాన్,కొత్తిండ్లు దొరస్వామి నాయుడు తదితర నాయకులు చైర్మన్ సురేష్ బాబుకు పుష్పగుచ్చం అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీకేఎం - ఉడా ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలు మరియు అభివృద్ధి పనుల్లో మదనపల్లి ప్రాంతానికి అధిక ప్రాధాన్యం కల్పించాలన్నారు.అలాగే మదనపల్లి అభివృద్ధి కార్యక్రమాల్లో స్థానిక నాయకులు,కార్యకర్తలను కూడా భాగస్వామ్యం చేయాలని చైర్మనుకి విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా పీకేఎం - ఉడాని అభివృద్ధి పథంలో నడిపించాలని కోరారు.అనంతరం చైర్మన్ సురేష్ బాబు మాట్లాడుతూ పీకేఎం - ఉడా అభివృద్ధిలో స్థానిక నాయకుల సహకారం ఎంతో అవసరమన్నారు.అందరి సహకారంతో సంస్థను అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఆయన స్పష్టం చేశారు.
Reporter
Namitha News