నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పెద్దమండ్యం ఆగస్టు 14 : అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె మండలంలో పరువు హత్య చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలిక గత నెలలో అదృశ్యమైంది. తంబళ్లపల్లె పోలీసులు కేసు నమోదు చేసి, ఆమెను వెతికి తెచ్చి తల్లిదండ్రులకు అప్పగిం చారు. అయితే ఆ బాలిక సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం, పెద్దలు గుట్టుచప్పుడు కాకుండా శవాన్ని కాల్చే యడంతో పరువుహత్య కావచ్చనే అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. పోలీసుల తీరు మీదా పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం ఆ బాలిక తన బంధువుల అబ్బాయి ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో అతడితో వెళ్లిపోగా మైనార్టీ తీరిన తర్వాత పెళ్లి చేస్తామని తల్లిదండ్రులు సర్ది చెప్పి ఇంటికి తీసుకెళ్లారు. అంత లోనే పెద్దమండ్యం మండలం బండ్రేవు పంచాయతీ తపసిమా నుగుట్ట వద్ద ఎవరో బాలిక చెట్టుకు చున్నీతో ఉరి వేసుకొని మృతి చెందినట్లు గొర్రెల కాపరులు సోమవారం గుర్తించి వీఆర్వో పక్కీర్షవలీకి తెలియజేయగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేస్తే ఇబ్బందులు ఎదురవుతా యన్న భయంతో పెద్ద మనుషులు పోలీసులను మేనేజ్ చేసి, మృతదేహాన్ని గుట్టకు పడమర వైపున పొలంలో కాల్చివేశారు. ఈ విషయంపై మదనపల్లె డీఎస్పీ కొండయ్య నాయుడిని వివ రణ కోరగా, అనుమానాస్పద స్థితిలో మరణించినట్లుగా కేసు నమోదు చేశామని చెప్పారు. దీనిపై విచారణ జరిపిస్తామని, శవాన్ని కాల్చి వేసినట్లు రుజువైతే నిందితులపై చర్యలు తీసు కుంటామని తెలిపారు. పెద్దమనుషులు, పోలీసుల ప్రమేయంపై విచారణ చేపడతామని వివరించారు.
Admin
Namitha News