నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : అమరావతి జూలై 16: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం సీఎం చంద్రబాబు నాయుడు సారధ్యంలో జరిగిన ఈ భేటీలో మంత్రుల మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పంటల బీమా పథకానికి ప్రీమియం చెల్లింపుపై విధివిధానాల ఖరారుకు కమిటీ వేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు ముగ్గురు మంత్రులతో కమిటీని మంత్రివర్గం నియమించింది. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు కెబినెట్ ఆమోదం. కొత్త ఇసుక విధానానికి కెబినెట్ ఆమోదం. కొత్త ఇసుక పాలసీపై త్వరలో విధి విధానాలను రూపొందించనున్న ప్రభుత్వం. పౌర సరఫరాల శాఖ రూ.2 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారెంటీకి మంత్రి వర్గం ఆమోదం. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు నిమిత్తం ఎన్సీడీసీ నుంచి రూ.3200 కోట్ల రుణానికి వ్యవసాయ, సహకార కార్పోరేషన్‌కు ప్రభుత్వ గ్యారెంటీకి కేబినెట్ ఆమోదం.
Admin
Namitha News