Thursday, 16 April 2026 08:02:33 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

పుంగనూరు లో అసైన్డ్ భూమి కి పట్టాల పంపిణీ చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి

Date : 08 March 2024 03:32 PM Views : 274

నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : పుంగనూరు : పుంగనూరు లో 1102 ఎకరాల వ్యవసాయ భూమి ధరఖాస్తు పట్టాలను పంపిణీ చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి . ముఖ్య అతిథిగా హాజరైన రాజంపేట ఎంపి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి , చిత్తూరు ఎంపి రెడ్డెప్ప . పుంగనూరు రూరల్ మండలంలో మొత్తం 146 మంది లబ్ధిదారులకు 185.26 ఎకరాల భూమి పంపిణీ కార్యక్రమం పుంగనూరు నియోజకవర్గంలో మొత్తం 864 మంది లబ్ధిదారులకు 1101.90 ఎకరాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపిన మంత్రి . లబ్ధిదారులకు పట్టాలు అందజేసిన మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపి శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి .

ఎంపి శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మాట్లాడుతూ ..... వైసిపి ప్రభుత్వం లో ఎంత మంచి జరిగింది, టిడిపి హయాంలో ఎంత మంచి జరిగింది అనేది ప్రజలు ఆలోచించాలి పేద పిల్లల చదువులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా సిఎం శ్రీ వైఎస్ జగన్ చర్యలు తీసుకున్నారు . ఒక్క రూపాయి లంచం తీసుకోకుండా, ఒక్క రెకమెండేషన్ లేకుండా పథకాలు వస్తున్నాయి . చంద్రబాబు అధికారం లోకి వస్తే వాలంటీర్ వ్యవస్థ ను తీసేస్తారు, సచివాలయాలను జన్మభూమి అభివృద్ధి కార్యాలయాలు గా మారుస్తారు . చంద్రబాబు అవసరం కోసం ఎన్ని అబద్దాలైన చెప్తారు. మహిళా రుణమాఫీ, రైతు రుణమాఫీ అని చంద్రబాబు అధికారంలోకి రాగానే మోసం చేశారు . వాటర్ గ్రిడ్ ద్వరా మన ప్రాంతానికి నీరు అందించేందుకు చర్యలు తీసుకున్న గొప్ప ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మన ప్రాంతంలో డ్యాం నిర్మాణం కు శ్రీకారం చుట్టారు పెప్పర్ మోషన్ ఎలెక్ట్రిక్ బస్సు తయారీ కంపెనీకి ఇప్పటికే భూసేకరణ చేశాం... కంపెనీ ప్రారంభమైతే మన ప్రాంతం మరింత అబివృద్ధి చెందుతుంది. ఈ నెల లో అనేక పార్టీలు దొంగ హామీలతో మన ఇంటికి వస్తారు. మన పాలనకు, వారి పాలన కు తేడా గమనించి ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నా .

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ... మన పట్టణం, నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేది అందరూ చూస్తున్నారు ... ఇలాంటి పాలన మళ్ళీ మనకు కావాలంటే సిఎం వైఎస్ జగన్ మరోసారి అధికారం లోకి రావాలి ... మంచి జరిగుంటెనే నాకు ఓటు వేయండి అని సిఎం వైఎస్ జగన్ దైర్యంగా చెప్తున్నారు . ఎంపి శ్రీ మిథున్ రెడ్డి కృషితో బైపాస్ రోడ్డు సిద్దం అవుతుంది ప్రతి గ్రామానికి తారు రోడ్డు వేశాం, సిమెంట్ రోడ్డులు వేశాం. ప్రతి గ్రామంలో ఒక ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించాం. మన ప్రాంతం లో తాగు సాగు నీరు కు అనేక ఇబ్బందులు ఉన్నాయని మిథున్ రెడ్డి అడగగానే సిఎం వైఎస్ జగన్ మన ప్రాంతంలో మూడు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు . అవి పూర్తి కావచ్చే తరుణంలో చంద్రబాబు సుప్రీంకోర్టు లో కేసు వేసి నిలుపుదల చేసాడు. తొందరగానే సుప్రీంకోర్టు లో కేసు క్లియర్ కాగానే పూర్తిచేస్తే అసలు సాగునీటి కి , త్రాగునీటి కి కొరత ఉండదు . హంద్రీనీవా కాలువలను వెడల్పు చేసే పనులు కుడా ప్రారంభించాం మన ప్రాంతంలో సోలార్ పవర్ ఏర్పాటు చేశాం, సమ్మర్ స్టోరేజ్ ట్యంక్ సిద్దం చేశాం ఎంపి మిథున్ రెడ్డి చొరవ తో పెప్పర్ మోషన్ ఎలెక్ట్రిక్ బస్సుల తయారీ కంపెనీ ఇక్కడికి తీసుకొచ్చాం పెప్పర్ మోషన్ ప్రారంభమైతే మన ప్రాంతం లో అనేక మందికి ఉపాధి లభిస్తుంది . భూమి విలువ పెరగడంతో పాటుగా అనేక చిన్న చిన్న ఫ్యాక్టరీలు కూడా వస్తాయి. ఈ ప్రాంతం అంతా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుంది. పుంగనూరు నియోజకవర్గ లో ఆరు మండలాల్లో కలిపి మొత్తం 864 మంది అసైన్మెంట్ లబ్ధిదారులకు 1101.90 ఎకరాలు భూమికి పట్టాలు అందిస్తున్నాం. రానున్న ఎన్నికల్లో వైసిపి పార్టీ ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను .

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :