నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె నవంబర్ 27 : తంబళ్లపల్లె మండలం లో బాల్య వివాహాల నిషేధానికి పోలీసులు, అధికారులు, నాయకులు, ప్రజలు సమిష్టి కృషి చేయాలని ఏఎస్ఐ నజీర్ భాష పిలుపునిచ్చారు. బుధవారం బాల్య వివాహాల కు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించి అనంతరం ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా మహిళా నేత సిద్ధమ్మ మాట్లాడుతూ బాల్య వివాహాలు సాంఘిక దురాచారం అని మరియు వివాహాలు బాలికల విద్య, రక్షణ, ఆరోగ్యం వారి భవిష్యత్తు కలలను దూరం చేస్తుందన్నారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోలీసులు, అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు చేయి చేయి కలిపి పోరాటం చేయాలన్నారు. అనంతరం వాళ్లే వివాహాలకు వ్యతిరేకంగా అధికారులు, నాయకులు, మహిళలు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం గంగాధర్, ఏపీవో అంజనప్ప, టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి,కానిస్టేబుల్ మణి నాయక్, ఐకెపి మహిళ సంఘాలు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.
Reporter
Namitha News