Thursday, 16 April 2026 06:08:08 PM
# వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు

అభివృద్ధిని అడ్డుకోవడమే వైసిపి కౌన్సిలర్ల అజెండా - ఆర్.జె. వెంకటేష్

Date : 01 October 2025 08:50 PM Views : 106

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అభివృద్ధిని అడ్డుకోవడమే వైసిపి కౌన్సిలర్ల అజెండా - ఎమ్మెల్యేని సమన్వయం చేసుకోవడంలో కౌన్సిల్ విఫలం - టిడిపి రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్.జె వెంకటేష్ విమర్శలు మదనపల్లె : అన్నమయ్య జిల్లా,మదనపల్లి మున్సిపాలిటీ ఏ-గ్రేడుగా అవతరించి,దాదాపు రెండు లక్షల జనాభాతో విస్తరించింది.అయితే 2021లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అప్పటి వైసిపి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల నామినేషన్లు చించివేయడం,భయభ్రాంతులకు గురిచేసి మున్సిపాలిటీని కైవసం చేసుకుంది.అయితే పేరుకే కౌన్సిల్ ఏర్పడింది తప్ప,మదనపల్లి పట్టణ అభివృద్ధిని గాలికి వదిలేసిందన్నారు.తూతూ మంత్రంగా కౌన్సిల్ సమావేశాలు నిర్వహించడం అభివృద్ధిని విస్మరించడం షరా మామూలైపోయింది.అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించడం,మదనపల్లి ఎమ్మెల్యేగా ప్రజా నాయకుడు షాజహాన్ బాషా ఎన్నికయ్యారన్నారు.ఆయన బాధ్యతలు చేపట్టి 15 నెలలు పూర్తయిందని,ఆయనతో కలిసి పనిచేయడంలో కౌన్సిల్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు.వాస్తవానికి ఎమ్మెల్యే మున్సిపాలిటీకి అఫిషియో మెంబరుగా వ్యవహరిస్తారని ఆయనకు కనీసం గౌరవం ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.20 వార్డు కౌన్సిలర్ పచ్చిపాల తులసి రామకృష్ణ కౌన్సిల్ సమావేశాలు కేవలం స్నాక్స్,టీ లు తాగడానికే పరిమతవుతోం దని ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని ఆయన సమర్థించారు.ఆమె చక్కగా స్పందించారని ప్రశంసించారు.ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయని,దోమలు బాగా వృద్ధి చెంది అంటువ్యాధులు ప్రబలుతున్నాయని,దీనిపై కౌన్సిల్ స్పందించకపోడం దురదృష్టకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇప్పటికైనా కౌన్సిల్ స్పందించి,ఎమ్మెల్యేని సమన్వయం చేసుకొని పట్టణ అభివృద్ధికి చొరవ చూపాలని హితవు పలికారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :