నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా బి. కొత్తకోట *భూ కబ్జాను అడ్డుకున్న తండ్రి కొడుకులు పై ఇనప రాడ్లతో దాడి* భూ కబ్జాను అడ్డుకున్న తండ్రి కొడుకుపై ప్రత్యర్థులు ఇనుప రాడ్లతో దాడి చేసినట్లు సీఐ రాజారెడ్డి తెలిపారు. బి కొత్తకోట మండలం, కాండ్లమడుగు క్రాస్, కోటా ఊరులో రైతు రామచంద్ర భూమిని ఆదివారం స్థానికంగా ఉన్న టి.నారాయణ, కృష్ణప్ప, నాగరాజా, వెంకటేష్, సుధాకర్ దౌర్జన్యంగా కబ్జాచేయడానికి యత్నించారు. గమనించిన భూమి యజమాని రామచంద్ర, భాస్కర్ వెంటనే వెళ్లి భూ కబ్జాను అడ్డుకున్నారు. ఆ గ్రహించిన నారాయణ వర్గీయులు ఇనుప రాడ్లు కర్రలతో తండ్రి కొడుకులపై విచక్షణ రహితంగా దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితులను మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్య చికిత్సలు అందించారు. సీఐ అదేశాలతో పోలీసులు బాధితుడిని విచారించి కేసు నమోదు అనంతరం దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు..
Reporter
Namitha News