నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి.కొత్తకోట : తంబళ్లపల్లె నియోజకవర్గం బి. కొత్తకోట మండలం కోటావూరు గ్రామపంచాయతీ కాండ్ల మడుగు క్రాస్ నందు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర తెదేపా కార్య నిర్వాహక కార్యదర్శి ఎస్ఎం పర్వీన్ తాజ్. ఈ సందర్భంగా రాష్ట్ర తెదేప కార్యనిర్వక కార్యదర్శి ఎస్ఎం పర్వీన్ తాజ్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఒకటవ తారీకు ఆదివారం రావడం వలన పెన్షన్ దారులైన అవ్వ తాతలు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు ఇబ్బందిపడి ఎదురు చూడకుండా ఒకరోజు ముందస్తుగా పెన్షనులను కూటమి ప్రభుత్వం లో రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ. నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు పంపిణీ చేయడం జరుగుతుందని ఒకే నెలలో రెండుసార్లు పెన్షన్లు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది చంద్రబాబు నాయుడు గారు సంపదను సృష్టించి ఈ రాష్ట్రం కూటమి నాయకుల సహకారంతో అభివృద్ధి సంక్షేమంలో ముందుకు వెళుతుందని అన్నారు. కాండ్లమడుగు క్రాస్ నందు కల ఆంజనేయస్వామి దేవాలయంలో జరిగిన ఆకు పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. ఈ కార్యక్రమంలో సచివాలయ సెక్రటరీ నాగమల్లు ,కూటమి నాయకులు కోటవూరు గ్రామ మాజీ సర్పంచ్ జయచంద్రారెడ్డి , బండారు వారి పల్లి గ్రామ మాజీ సర్పంచ్ నాగరాజు, చిటికి. శివారెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, మాజీ మండల ప్రధాన కార్యదర్శి ప్రభాకర, వెంకటేశ్వర రెడ్డి, మహేశ్వర రెడ్డి, జనసేన మండల కార్యదర్శి ప్రకాష్ ,మనోహర్ రెడ్డి, వెంకటరమణ, మోమిన్ పీర్, సోమశేఖర,స్కూల్ కమిటీ చైర్మన్ స్కూల్ కమిటీ చైర్మన్ చాంద్ భాష, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు
Admin
Namitha News