Thursday, 16 April 2026 06:08:04 PM
# వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన అన్నమయ్య జిల్లా మాజీ ఎస్పీ

ప్రభుత్వ వైఫల్యాలపై శాంతియుతంగా నిరసనలు చేస్తే కేసులా - సిపిఐ

Date : 14 September 2025 08:07 PM Views : 311

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మొలకలచెర్వు - సెప్టెంబర్ 14 : రాష్ట్రంలోని రైతాంగానికి పంటలకు సరిపడే ఎరువులను సక్రమంగా సరఫరా చేయాలని,బ్లాక్ మార్కెటింగ్ ను అరికట్టాలనే డిమాండ్స్ మీద,భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపుమేరకు, రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా గత సోమవారం మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట శాంతియుతంగా నిరసన ప్రదర్శన నిర్వహించిన కమ్యూనిస్టు నాయకులపై అక్రమ కేసులు బనాయించి,ప్రశ్నించే గొంతులను నొక్కాలని చూడడం కూటమి ప్రభుత్వానికి తగదని, మీకు చేతనైతే భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని సిపిఐ తంబళ్లపల్లె నియోజకవర్గపు కార్యదర్శి ఎస్.మనోహర్ రెడ్డి హితవు పలికారు. ఆదివారం ఉదయం 11 గంటలకు స్థానిక మదనపల్లి రోడ్డు నందు గల పార్టీ కార్యాలయము నందు,జిల్లా పోలీసుల నిరంకుశ వైఖరికి నిరసనగా,జిల్లా పార్టీ పిలుపుమేరకు ప్రతిపక్ష పార్టీలు మరియు ప్రజా సంఘాలతో కలసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు నాయకులు మాట్లాడుతూ;రైతులకు సరిపడే యూరియా అందుబాటులో లేదని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు జరిగినప్పటికీ,ఒక్క అన్నమయ్య జిల్లాలో మాత్రమే కేసులు నమోదు చేయడం చూస్తుంటే తాజా మాజీ లైన జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీలు ఇరువురు రాష్ట్ర ప్రభుత్వం యొక్క మెప్పు పొందేందుకు ఇలా అక్రమ కేసులు బనాయించి ఉద్యమాలను అంచాలని చూశారని అన్నారు. జిల్లాలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడాల్సిన ఎస్పీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నిరసనలు చేస్తున్న కమ్యూనిస్టులపై నిర్బంధాలు,అక్రమ అరెస్టులు,బైండోవర్ కేసులు,అక్రమ కేసులు బనాయించడం తదితర అప్రజాస్వామిక చర్యలకు పాల్పడడం తగదని, జిల్లాలో వరుస సంఘటనలు జరుగుతున్నా కూడా కూటమి ప్రభుత్వం మౌనంగా ఉండడం చూస్తుంటే,ఇది కూటమి ప్రభుత్వమా..లేదా కాళకూటమి ప్రభుత్వమా..అనే అనుమానం కలుగుతుందన్నారు.గత ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి తేడా ఏముందో ముఖ్యమంత్రి చెప్పాలని,ప్రభుత్వం ఎరువులు సక్రమంగా సరఫరా చేసి ఉండుంటే అన్నదాతలు ఎరువుల కోసం రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు దాపురించిందని ప్రశ్నించారు.లాటీలు, తూటాలు,అక్రమ కేసులు, జైళ్లు,నిర్బంధాలు కమ్యూనిస్టులకు,ఉద్యమకారులకు ఏమీ కొత్త కాదని,వీటికి జంకే పరిస్థితి ఏమాత్రం ఉండదని,ఉద్యమాలు మరింత ఉదృతమౌతాయని అన్నారు.ఇప్పటికైనా జిల్లా పోలీస్ యంత్రాంగం కమ్యూనిస్టుల,ప్రతిపక్ష పార్టీల,ప్రజా సంఘాల కార్యకలాపాల పైనా,ఉద్యమాల పైన పెట్టిన ప్రత్యేక శ్రద్ధను విడనాడి,జిల్లాలోని ప్రజా సమస్యల పరిష్కారం కోసం శ్రద్ధ చూపాలని,ప్రశ్నించే గొంతులను నొక్కడానికి తీవ్రంగా ప్రయత్నించిన జిల్లా మాజీ ఎస్పీ మీద చర్యలు తీసుకోవాలని,కమ్యూనిస్టు నాయకులపై పెట్టిన ఆక్రమ కేసులు ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.*ఈ సమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి కే.అంజనప్ప,నియోజకవర్గపు కార్యవర్గ సభ్యులు జీ.రఘునాథ్,ఎస్.తంబయ్యశెట్టి,ఎం.అష్రఫ్అల్లీ,ఎస్.నిజాముద్దీన్,కాంగ్రెస్ పార్టీ తంబళ్లపల్లె నియోజకవర్గం అధ్యక్షులు కే.హైదరవల్లి,బహుజన సమాజ్ వాది పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దపాలెం.సోమశేఖర్, భారతీయ అంబేద్కర్ సేన సీనియర్ జిల్లా నాయకులు మంత్రాల.రమణ,దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు హరికుమార్,ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గపు కన్వీనర్ డి.తరుణ్,మహిళా సంఘం నాయకురాళ్ళు పద్మావతి,శంకరమ్మ లు, రైతు సంఘం నాయకులు యల్లప్ప,కే.రమణ లు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రెడ్డప్ప, సుబ్బన్న, ఉత్తన్న తదితరులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :