నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె భూ దందలు, ఫేక్ పట్టాలపైన విచారణ చేపట్టిండి.... అర్హులైన వారికి న్యాయం చేయండి..... జిల్లా కలెక్టర్ కు మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ డిమాండ్ మదనపల్లె పట్టణ 6 వ వార్డు, 25 వార్డులో నిస్సార్ అహమ్మద్ ఆద్వర్యంలో బాబు ష్యూరిటి మోసం గ్యారంటీ -- దళారుల చేతిలో మోసపోతున్న పేదలు... గతంలో పని చేసిన ఎమ్మార్వోలు, తహసీల్దారుల పేరుతో నకిలీ పట్టాలు... జిల్లా కలెక్టర్ చోరవ తీసుకుని విచారణ చేపట్టాలి.... పేదలకు న్యాయం చేయాలి.... మదనపల్లె పట్టణం చూట్టూ జరుగుతున్న భూ కుంభకోణం పైన న్యాయ విచారణ చేపట్టాలని, అర్హులైన పేదలకు ప్రభుత్వం ఇంటిపట్టాలి ఇచ్చే వరకు మదనపల్లెలో పేదల పక్షాన వైసిపి పోరాటం చేస్తుందని మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ పేర్కొన్నారు. సోమవారం మదనపల్లె మున్సిపాలిటీ 6, 25 వ వార్డులలో నిస్సార్ అహమ్మద్ ఆద్వర్యంలో బాబు ష్యూరిటి మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. కూటమి ఏడాది పాలనలో సూపర్ సిక్స్ పధకాల అమలు పైన ప్రజల నుంచి నిస్సార్ అహమ్మద్, వైసిపి నాయకులు వివరాలు సేకరించారు. ఇచ్చి హామిలు అమలు చేయక ప్రజలను చంద్రబాబునాయుడు మోసం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా నిస్సార్ అహమ్మద్ మాట్లాడుతూ మదనపల్లె పట్టణం చూట్టూ విలువైన భూములు కొంతమంది దళారీలు పేదలకు ఫేక్ పట్టాలతో అంటగట్టి మోసం చేస్తున్నారని ఆరోపించారు. అనపగుట్ట, కోళ్ళబైలు, జగన్ కాలనీ, వైయస్సార్ కాలనీ, పోతబోలు పంచాయతీలలో దళారుల పెత్తనం ఎక్కువ అయింది. భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. గతంలో 10, 15 సంవత్సరాల క్రితం పని చేసిన ఎమ్మార్వోలు, తహసీల్దార్ల సంతకాలతో పట్టాలు తెచ్చుకుని ఇవి మావే అంటూ మోసాలు చేస్తున్నారు. అప్పుడు ఇచ్చారు, ఇప్పుడు మేము కట్టుకుంటామాని, భూములు చదరం చేస్తున్నారని, డూప్లికెట్ పట్టాలు తీసుకుని భారీగా భూ కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. దళారీలు ఎక్కువ అయిపోయారని, డుప్లికెట్ పట్టాలపైన విచారణ చేయడంతోపాటు పాత ఎమ్మార్వోలు, తహసీల్దార్లు ఇచ్చిన పట్టాలపై విచారణ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ఇంటి పట్టాల మంజూరుకు సంబంధించిన అన్ని రిజిస్టర్లు వున్నాయా అని ప్రశ్నించారు. నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దళారులు స్థలాల తీసుకుని రూ.5 లక్షలవరకు అమ్మి పేదలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. మదనపల్లె చూట్టూ జరుగుతున్న ఈ భూ స్కాం పైన జిల్లా కలెక్టర్ విచారణ చేపట్టాలని కోరారు. అర్హులైన వారికి న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామని ప్రకటించారు.
Reporter
Namitha News