నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఆగస్టు 22 ః స్టోర్ డీలర్లు లబ్ధిదారులకు సకాలంలో బియ్యం, నిత్యావసరాల పంపిణీలో అలసత్వం వహించరాదని తాసీల్దారు శ్రీనివాసులు హెచ్చరించారు. శుక్రవారం జరిగిన స్టోర్ డీలర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేషన్ తొలుత వృద్ధులకు, దివ్యాంగులకు వారి ఇండ్లకు పంపిణీ చేయాలని సూచించారు. అనంతరం తంబళ్లపల్లె లోని పలు చౌక దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసి సకాలంలో డీడీలు చెల్లించి పంపిణీకి సహకరించాలని రేషన్ పంపిణీ లో ఎలాంటి అవకతవకలు సహించేది లేదని సూచనలు చేశారు. ఈ సమావేశంలో డిటి నవీన్, అర్.ఐ ముద్దుకృష్ణ, వీఆర్వోలు నాగరాజు, వెంకటరమణ, స్టోర్ డీలర్లు పాల్గొన్నారు.
Reporter
Namitha News